వాంఖడేలో ఆ రెండు సీట్లు ప్రత్యేకం
శనివారం ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా ముంబయి వాంఖడే స్టేడియంలోని రెండు సీట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. 2011 వరల్డ్‌కప్ విన్నింగ్‌కు గుర్తుగా ఆ సీట్లకు బీసీసీఐ ప్రత్యేకరూపునిచ్చింది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను విశ్వ విజేతగా నిలబెట్టాడు. దీంతో ఆ బంతి పడిన చోట ఉన్న రెండు సీట్లను స్డేడియం నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. అంతేగాక ఆ కుర్చీలు ఉన్న స్టాండ్‌కు ‘ప్రపంచకప్ 2011 విజయ స్మారక స్టాండ్’ అనే పేరు పెట్టారు.