29 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ
ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. దక్షిణ ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. టాస్మానియా టీమ్‌పై 29 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తద్వారా లిస్ట్ ఏ క్రికెట్‌లో ఫాసెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును ఫ్రేజర్ అధిగమించాడు. చివరికి 38 బంతుల్లో 125 పరుగులు చేసి ఫ్రేజర్ పెవిలియన్‌కు చేరాడు. ఏబీడీ 2015లో విండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ బాదాడు.