అందుకే సినిమాలకు దూరమయ్యా; జెనీలియా
పెళ్లైన తర్వాత మంచి ఇల్లాలిగా, తల్లిగా ఉండాలనే సినిమాలకు దూరమయ్యానని హీరోయిన్ జెనీలియా తెలిపింది. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు చూసుకోవాలనే సినిమాలవైపు అడుగులు వేయలేదని చెప్పింది. కాగా జెనీలియా ‘వేద్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తన భర్త రితేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా ‘మజిలీ’కి ‘వేద్’ రీమేక్.జెనీలియా ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది.