హీరోయిన్ కార్తీకకు అరుదైన గౌరవం
సీనియర్ నటి రాధ కుమార్తె, హీరోయిన్ కార్తీక నాయర్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. కార్తీక దుబాయ్‌లో పలు వ్యాపారాలు చేస్తోంది. ఉదయ్ సముద్ర గ్రూప్ సంస్థలను దుబాయ్ కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ఆమె దుబాయ్‌లోనే నివసిస్తోంది. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన కార్తీకకు ఈ వీసా అందజేశారు. కాగా కేరళలోనూ ఉదయ్ సముద్ర గ్రూప్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, విద్యాసంస్థలు నిర్వహిస్తోంది.