అతియా లెహెంగా; తయారీకి ఎన్ని గంటలంటే;
భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిలు ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ముంబైలోని ఖండాలా గెస్ట్ హౌజ్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వధూవరులు రాహుల్ షేర్వానీ ధరించగా, అతియా పింక్ కలర్ లెహెంగా ధరించింది. ఈ లెహెంగాను చేతితో డిజైన్ చేశారు. దీనిని తయారు చేయడానికి దాదాపు 10 వేల గంటల సమయం పట్టింది. అంటే ఏడాదికి పైమాటే. అనామికా ఖన్నా దీనిని డిజైన్ చేశారు. ఈ లెహెంగా ధర రూ.లక్షల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.