హెబ్బాా పటేల్ ‘B&W’ టీజర్ విడుదల
కుమారి 21ఎఫ్‌తో పరిచయమైన హెబ్బా పటేల్ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమా టైటిల్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. బటన్ నొక్కి ఆయన టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రొమాన్స్, యాక్షన్ సీన్లతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా టీజర్ సాగుతోంది. ఎల్.ఎన్.వి సూర్యప్రకాశ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నేని నవీన్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.