పెళ్లిపీటలు ఎక్కనున్న వరుణ్ తేజ్; ఆమెతోనేనా?
త్వరలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి ప్రకటన వస్తుందని ఆయన తండ్రి, నటుడు నాగబాబు ప్రకటించారు. కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని వెల్లడించలేనని.. పెళ్లికూతురుకు సంబంధించిన విషయాలను తాను చెప్పదలుచుకోలేదని పేర్కొన్నారు. వివాహం అనంతరం వరుణ్ తన భార్యతో కలసి వేరే ఇంట్లో ఉంటాడని.. తాను తన భార్యతో కలసి మరో ఇంట్లో ఉంటానని నాగబాబు వివరించారు. కాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు వస్తున్నాయి.