• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బన్నీ ఇంటి వద్ద కోలాహలం

  ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బన్నీ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. సినీ ప్రముఖులు, అభిమానులతో బన్నీ ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ భారీగా చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. తాను ప్రస్తుతం షాకింగ్‌లో ఉన్నానని.. తర్వాత మాట్లాడతానని బన్నీ తన ఫ్యాన్స్‌కు సైగలు చేశాడు. His happy moment's @alluarjun ✨#69thNationalAwards #pushpa#NationalFilmAwards2023pic.twitter.com/cUOz6NMFHF — Allu Arjun TFC™ (@AlluArjunTFC) August 24, … Read more

  ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా: బీజేపీ ఎంపీ

  ఎంపీ నిధులతో తాను ఇల్లు కట్టుకున్నానని ఆదిలాబాద్ బీజేీపీ ఎంపీ సోయం బాపూరావ్ తెలిపారు. ‘‘ఎంపీ ల్యాడ్స్ నిధులతో నేను ఇల్లు కట్టుకుంటే తప్పేంటి. అందుకే సొంత అవసరాలకు వాడుకున్నా. సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదు. అందుకే ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంట్లోనే నా కుమారుడికి పెళ్లి చేశాను. అభివృద్ధి కోసం నిధులు పంచకపోవడం తప్పే. గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నేను నిధుల గోల్‌మాల్‌కు పాల్పడలేదు.’’ అంటూ ఎంపీ బాపూరావ్ చెప్పుకొచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో నేను ఇల్లు … Read more

  హైదరాబాద్‌లో మరో ఇల్లు కొన్న సమంత: ఎంతంటే?

  స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రంగారెడ్డి జిల్లాలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని విలువ సుమారు రూ.7.8 కోట్లని టాక్. కాగా ఇంతకుముందు కూడా సమంత ముంబైలో ఓ లగ్జరీ హౌజ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముంబై సముద్రతీరంలో రూ.15 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది.

  ఇల్లునే విమానంలా నిర్మించాడు

  [VIDEO:](url) విమానం ఎక్కలేదన్న కోరిక అలాగే ఉండటంతో కంబోడియాకు చెందిన క్రాస్ పియో వినూత్నంగా ఆలోచించాడు. విమానం లాంటి ఇంటినే నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డబ్బును జమ చేసుకున్నాడు. అచ్చం ప్రైవేట్ జెట్‌లాగా ఉండేలా ల్యాండింగ్ గేర్, ఇంజిన్, రెక్కలు, టెయిల్ ఫిన్‌ని స్వయంగా డిజైన్ చేసుకుని ఇంటిని కట్టుకున్నాడు. మొత్తంగా 20 వేల డాలర్లను ఖర్చు చేసి కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. విమనంలో ప్రయాణిస్తున్న అనుభూతి పొందేలా లోపల డిజైన్ చేసినట్లు పియో తెలిపాడు. పర్యటకుల సందర్శనకు కూడా అనుమతిస్తున్నాడీ … Read more

  ఇంటి సీలింగ్‌లో శబ్దాలు; పగలగొట్టి చూస్తే షాక్?

  ఒళ్ల గగుర్పొడిచే [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంటి పైకప్పు నుంచి మూడు భారీ పాములు బయటపడడం సంచలనంగా మారింది. మలేషియాలో ఓ వ్యక్తి ఇంటి సీలింగ్ నుంచి శబ్దాలు వస్తుండడంతో భయపడి ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. వారు సీలింగ్ పగలగొట్టగా మూడు భారీ పాములు బయటపడ్డాయి. ఈ పాములు అక్కడికి ఎలా చేరుకున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. They were hearing strange noises above them while … Read more

  మాజీ సీఎం ఇంటికి నిప్పు; త్రిపురలో ఉద్రిక్తత

  త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ కుమార్ దేబ్ ఇంటికి దుండగులు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయ్‌పూర్‌లో ఉన్న రాజ్‌నగర్‌లోని బిప్లబ్ ఇంట్లో తన తండ్రి వర్థంతి కార్యక్రమాలు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటిని ధ్వంసం చేసి బయట ఉన్న వాహనాలకు [నిప్పు](url) పెట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి భద్రత పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ దాడి వెనుక కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. Former Tripura CM Biplab Deb’s … Read more

  ఇంటికి కాపలాగా కోబ్రా; వీడియో వైరల్

  ఓ ఇంటికి కోబ్రా కాపలాగా ఉంది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నాగుపాము తలుపు సందులోంచి పడగ విప్పి బుస కొడుతోంది. ఈ క్రమంలో తనను వీడియో తీస్తున్న వ్యక్తిని అమాంతం కాటు వేయబోయింది. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది తెలియరాలేదు. మన దేశంలోనే జరిగి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ది బెస్ట్ సేఫెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్’ అంటూ కామెంట్లు జోడిస్తున్నారు. Haha we need one of … Read more