• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ శుభాకాంక్షలు

    ఇస్రో గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా నేడు టీవీ-డీ1 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గగన్‌యాన్ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు. అయితే నేడు నింగిలోకి వెళ్లిన రాకెట్ నుంచి మాడ్యూల్ విడిపోయి పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది.

    గగన్ యాన్ ప్రయోగం సక్సెస్

    ఇస్రో చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ అయింది. రోదసి నుంచి గగన్ యాన్ మాడ్యూల్‌ను పారాచ్యూట్ సాయంతో విజయవంతంగా శాస్త్రవేత్తలు కిందకు దింపారు. అంతకుముందు రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం కాసేపు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు సరి చేయడంతో మరోసారి ఇస్రో గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టింది. సరిగ్గా ఉ.10 గంటలకు TV-D1 సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నిప్పులు కక్కుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 8.30 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగం మొదలు పెట్టగా… సాంకేతిక లోపంతో ప్రయోగం తాత్కాలికంగా … Read more

    ప్రజ్ఞాన్‌పై ఇంకా ఆశలున్నాయి: ఇస్రో

    చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతం చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ నిద్రిస్తుంది. దానిని పడుకొనిద్దాం. తనంతటే తానే క్రియాశీలం అయ్యే అవకాశాలు ఇంకా మెండుగా ఉన్నాయి. రోవర్‌ను మైనస్ 200 డిగ్రీల వద్ద పరీక్షించినప్పుడు పనిచేసింది. అందుకే ఇప్పటికీ ప్రజ్ఞాన్ రోవర్ క్రియాశీలమవుతుందనే నమ్మకం ఉందన్నారు.

    ఈ నెల 21న ఇస్రో కీలక ప్రయోగం

    ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ తొలి ప్రయోగాన్ని ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌ను పరీక్షించనున్నారు. మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడంపై టెస్ట్ నిర్వహించనున్నారు.

    ‘చంద్రయాన్-3’ ఇక ముగిసినట్లేనా..?

    ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని సంస్థ మాజీ చైర్మన్ కిరణ్‌కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 22న చంద్రుడిపై సూర్యోదయం అయిన్పటికీ అవి మేల్కోలేదని, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ఇక ముగిసినట్టేనని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రాజెక్ట్ ఫలితం ఇప్పటికే నెరవేరిందని, ఈ దేశానికి సాధ్యం కాని పని మనం చేశామన్నారు.

    భారీ ప్రయోగానికి సద్ధమవుతోన్న ఇస్రో

    చంద్రయాన్-3 సక్సెస్ అందించిన ఉత్సాహంతో ఇస్రో మరో భారీ ప్రయోగానికి సద్ధమవుతోంది. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీంతో పాటు ఎక్కువ కాలం ప్రయాణించేందుకు వీలుగా మానవ సహిత అంతరిక్ష నౌకను సైతం సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. తాము నిర్మించే స్పేస్ స్టేషన్ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    ఆదిత్య ఎల్‌1 కీలక మైలు రాయి

    సూర్యుడిపై ప్రయోగించిన ‘ఆదిత్య- ఎల్ 1 మరో మైలురాయిని చేరుకుంది. భూమి నుంచి ఈ వ్యౌమనౌక 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించింది. తాజాగా ISRO ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు పేర్కొంది. ఈ వ్యౌమనౌక భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ మొదటిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో తెలిపింది.

    చంద్రుడి నుంచి తొలి వీడియో

    చంద్రుడు నుంచి వచ్చిన తొలి వీడియోను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై ల్యాండర్ దిగడానికి కొన్ని కి.మీ ముందు నుంచి చంద్రుడుపై దిగేంతవరకు వీడియో రికార్డైంది. చందమామపై ఉన్న బిలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రయాన్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా ఈ వీడియోను రికార్డు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Video of moon taken by Chandrayaan-3 lander just before touchdown released ??pic.twitter.com/yjG1wGDy1M — RVCJ Media (@RVCJ_FB) August 24, 2023

    GSLV F-12 ప్రయోగం సక్సెస్

    ఇస్రో ప్రయోగించిన GSLV F-12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. GSLVF–12 రాకెట్‌ ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్‌–01 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. తాజా ప్రయోగం సక్సెస్‌తో స్వదేశీ నావిగేషన్ సిస్టం బలోపేతం కానుంది. ఈ ఉపగ్రహం పనితీరుతో భూ, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో భూమిపై నావిగేషన్ సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. #WATCH | Indian Space Research Organisation … Read more

    నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-12

    శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటు GSLV F-12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం మొదలైన కౌంట్ డౌన్ 10.46 నిమిషాలకు పూర్తై.. రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం రాకెట్ సవ్యమైన దిశలో సాగుతోందని శాస్త్రవేత్తల వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా స్వదేశి నావిగేషన్ ఉపగ్రహం NVS-01ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. CONGRATULATIONS @isro !!#ISRO launches GSLV-F12 NVS-01 Mission from Satish Dhawan Space Centre (SDSC-SHAR), #Sriharikota Link – https://t.co/WuZWseMSdO pic.twitter.com/ysGHCZsb1d — … Read more