రూ.999కే జియో భారత్ 4G ఫోన్
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరదీసింది. రూ.999కే 4G భారత్ ఫోన్‌ని అందించనుంది. 2G యూజర్లను 4Gలోకి మార్చడమే ధ్యేయంగా జియో ఈ ప్రకటన చేసింది. కార్బన్ కంపెనీ ఈ ఫోన్‌ని తయారు చేయనుంది. 1000mAh బ్యాటరీతో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా ఫోన్‌ని తీర్చిదిద్దనున్నారు. జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ డీఫాల్ట్‌గా రానున్నాయి. ఈ ఫోన్‌కి నెలకు రూ.123తో రీఛార్జి చేస్తే ప్రతిరోజు 0.5జీబీ డేటా, అపరిమిత కాల్స్ వినియోగించుకోవచ్చు.