• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 27న టీవీల్లోకి ‘కార్తికేయ2’

  తెలుగుతో పాటు హిందీలోనూ ‘కార్తికేయ 2’ థియేటర్లలో సత్తా చాటింది. అనంతరం ఓటీటీలోకి విడుదలై అక్కడా ఎక్కువ ఆదరణను పొందింది. ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్లలోకి విడుదవుతోంది. ఈ నెల 27న జీ సినిమాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీల్లోకి వస్తుంది. రాత్రి 8 గంటల నుంచి హిందీ, తెలుగు భాషల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో నిఖిల్ మరోసారి అలరించాడు. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించి మెప్పించింది. కృష్ణుడి కడియం కోసం అన్వేషించడమే ఈ సినిమా కథ.

  నో మేకప్ అంటున్న అనుపమ

  ఆదివారాన్ని కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ బాగా ఎంజాయ్ చేసింది. మేకప్ లేకుండానే ఫొటోలకు పోజులిచ్చింది. సూర్యోదయాన్ని ఆస్వాదించింది. మొహానికి మేకప్ అవశేషాలను తొలగించి.. చిరునవ్వుతో మెరిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకుంది. కళ్లని పెద్దవి చేస్తూ ఉరిమినట్లు చూస్తున్న ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ‘మేకప్ లేకున్నా అనుపమ అందంగా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులున్నాయి. ఇటీవల ‘కార్తికేయ 2’లో తన నటనతో మెప్పించింది. Screengrab Instagram: anupamaparameswaran96 … Read more

  అందంగా నవ్వుతున్న అనుపమ

  కార్తికేయ 2 సినిమాతో అలరించిన అనుపమ పరమేశ్వరన్ ఓనం పండుగలో మునిగి తేలుతోంది. సాంప్రదాయ దుస్తుల్లో ఈ చిన్నది తళుక్కుమంటోంది. అందమైన పళ్లు కనిపించేలా నవ్వుతోంది. తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోతూ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విరబూసిన మల్లెపూలతో అలరిస్తున్న ఈ భామ మీకు పండుగ శుభాకాంక్షలు చెబుతోంది. కామెంట్ సెక్షన్ లో మీరూ తనను విష్ చేయండి. ఈ అమ్మడు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన మూవీ పేరు కామెంట్ చేయండి. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram:

  అమెరికాలో ‘కార్తికేయ 2’ కొత్త‌ రికార్డు

  ‘కార్తికేయ‌2’ సినిమా అమెరికాలో కలెక్ష‌న్ల‌లో దుమ్ములేపుతుంది. యూఎస్ క‌లెక్ష‌న్లు ఆదివారం నాటికి 1.5 మిలియ‌న్ డాల‌ర్లు చేర‌తాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. కానీ శ‌నివారం నాటికి సినిమా ఆ టార్గెట్‌ను రీచ్ అయింది. ఇప్ప‌టివ‌రకు అక్క‌డ మొత్తం గ్రాస్ 1,509,768 డాల‌ర్లుగా ఉంది. నిఖిల్ హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వ‌సూలుచేసింది.

  కృష్టుడి బంగారు విగ్రహం గెలుచుకునే ఆఫర్

  నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కార్తికేయ-2. ఇప్పటికే విజయవంతమైన కార్తికేయకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. #KarthikeyaQuest పేరిట ఓ పొడుపు కథను ఇచ్చి అది విప్పితే బంగారు కృష్ణుడి ప్రతిమను పొందవచ్చని ప్రకటించింది. ‘ విశ్వం ఒక పూసల దండ, నిధి నీ భాగ్యంలో ఉంది అంటే భాగ్యనగరపు నడి బొడ్డులో ఉన్న జనాల పూసల దండని చేరుకో’ అంటూ క్లూ ఇచ్చింది.

  ‘కార్తికేయ 2’ టీమ్‌కు మ‌ధుర‌ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆహ్వానం

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టించిన ‘కార్తికేయ 2’ మూవీ టీమ్‌కు ఒక స‌ర్‌ప్రైజ్ ఆహ్వానం అందింది. మ‌ధుర‌లోని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహ‌కులు కార్తికేయ‌2 చిత్ర‌బృందాన్ని అక్క‌డికి ఆహ్వానించారు. మూవీలో కృష్ణుడి గురించి ఉన్న కాన్సెప్ట్ వాళ్ల‌కు బాగా న‌చ్చ‌డంతో ఈ ఆహ్వానాన్ని పంపిన‌ట్లు నిఖిల్ సోష‌ల్‌మీడియా ద్వారా తెలిపాడు. అక్క‌డే ఈరోజు అన్ని భాష‌ల టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అదేవిధంగా మూవీ కొత్త రిలీజ్ డేట్ గురించి కూడా అక్క‌డే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పాడు. కార్తికేయ‌2లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. చందుమొండేటి … Read more

  ఈ రోజు రాబోయే టాలీవుడ్ క్రేజీ అప్డేడ్స్ ఇవే

  తెలుగు సినిమా ప్రతి శుక్రవారం విడుదలైనా..రోజుకో అప్డేట్ మాత్రం అభిమానులను అలరిస్తుంటాయి. అలాగే ఇవాళ రాబోయే అప్డేట్స్ ఏంటంటే… కార్తికేయ2 సినిమా నుంచి నన్ను నేను అడిగా వీడియో సాంగ్. సాయంత్రం 5.30గం.లకు థ్యాంక్యూ మూవీ ట్రైలర్..సాయంత్రం 6.03 గం.లకు రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ © IPL Photos – IPLT20.com