‘కొత్త బంగారు లోకం’ రిజెక్ట్ చేసిన హీరోలు!
2008లో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ సినిమా కథను నాగచైతన్య కోసం నాగార్జునకు చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు. ఆయన రిజెక్ట్ చేయడంతో రామ్ పోతినేనికి వినిపించినట్లు తెలిపారు. రామ్ కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో చివరికి వరణ్ సందేశ్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు.