ఆసక్తిగా ధోనీ ‘LGM’ ట్రైలర్
భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మిస్తోన్న ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడ్) మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ వేడుకను చెన్నైలో గ్రాండ్‌గా జరిపారు. ఈ ఈవెంట్‌లో ధోనీ, ఆయన సతీమణి సాక్షి మెరిశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో హరీశ్ కళ్యాణ్ హీరోగా, ఇవానా హీరోయిన్‌గా నటించింది. రమేశ్ తమిళమణి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నదియా కీలకపాత్రలో నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.