• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేనేజర్ చేతిలో మోసపోయిన సమంత!

    స్టార్ హీరోయిన్ సమంతను ఆమె మేనేజర్ మోసం చేయబోయాడు. ఈ విషయాన్ని పసిగట్టిన సామ్ అతడిపై అసహనం వ్యక్తం చేసింది. సమంతకు తెలియకుండా రూ.కోటి కాజేయడానికి ఆమె మేనేజర్ మహేందర్ కుట్ర పన్నాడు. కానీ ఈ విషయం సామ్ దృష్టికి రావడంతో ఆమె ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. 13 ఏళ్లుగా తనతో పాటే ఉంటూ తనను మోసం చేయాలని ప్రయత్నించ డంతో ఆమె తట్టుకోలేకపోయిందని టాక్. దీంతో అతడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని సామ్ చూస్తున్నట్లు సమాచారం.

    మేనేజర్ మోసం: రష్మిక రియాక్షన్ ఇదే!

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఆమె మేనేజర్ ఇటీవల రూ.80 లక్షల మేర మోసం చేశాడు. దీనిపై తాజాగా ఈ అమ్మడు స్పందించింది. ‘‘నేను అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోదలుచుకోలేదు. మేమిద్దరం ఆరోగ్యకర వాతావరణంలో పని చేశాం. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పరస్పర ఒప్పందంతో విడిగా మా కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం విడివిడిగా పని చేయాలని అనుకున్నాం.’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. Courtesy Twitter: Suresh PRO Courtesy Twitter: Rashmika Mandanna

    మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక!

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ అతడి చేతిలో రూ.80 లక్షల మేర మోసపోయినట్లు సమాచారం. దీంతో రష్మిక అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించినట్ల వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రష్మిక బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రష్మిక ‘పుష్ప2’ లో నటిస్తోంది.