• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యాడ్స్‌పై మెటా గుడ్‌ న్యూస్‌

  ఇన్‌స్టాగ్రాం, ఫేసుబుక్‌, మెసెంజర్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకపై వివిధ రకాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లు, అడ్వర్టయిజ్‌మెంట్లపై కంట్రోల్ ఇవ్వనుంది. ఇందుకోసం కొత్తగా అకౌంట్‌ సెంటర్‌ను ప్రవేశపెడుతోంది. అకౌంట్‌ సెంటర్‌ ద్వారా వ్యక్తిగత విషాలు, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ, యాడ్‌ ప్రిఫరెన్స్‌లు ఇలా అన్నింటినీ మేనేజ్‌ చేసుకోవచ్చు. ప్రతీ యాప్‌లో వేర్వేరుగా కాకుండా యాప్‌ సెంటర్‌లో మార్చుకోవడం ద్వారా అన్నింటికీ వర్తింపజేసుకోవచ్చు.

  అమెరికాకు మెటా వార్నింగ్

  అమెరికా ప్రభుత్వానికి మెటా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఓ చట్టం తీసుకువస్తున్న సర్కారు..ఫెస్‌ బుక్‌లో షేర్‌ చేసే వార్తలకు చెల్లించాల్సిన ఫీజు విషయంలో మీడియా సంస్థలు బేరమాడేలా ఉన్నాయని వెల్లడించింది. తాము వార్త సంస్థలకు ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అవసరమైతే అమెరికా వార్తలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. గతంలో ఆస్ట్రేలియా ఇలాంటి చట్టం తీసుకువస్తే కొద్ది రోజులు ఫేస్‌బుక్‌ వార్తలను సస్పెండ్‌ చేసింది.

  మెటా ఇండియా హెడ్‌గా సంధ్య

  మెటా ఇండియా హెడ్‌గా సంధ్య దేవనాధన్‌ను ఆ సంస్థ నియమించింది. 2016 నుంచి సంధ్య మెటాలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తోంది. జనవరి 26న ఇండియన్ హెడ్‌గా సంధ్య బాధ్యతలు చేపట్టనుంది. ప్రస్తుతం భారతదేశంలో ఫేస్‌బుక్‌పై రెగ్యులేటరీ ఆంక్షలు ఉన్న తరుణంలో సంధ్య బాధ్యతలు నిర్వహించబోతోంది. కాగా ఇటీవలే మెటా ఇండియా హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్న అభిజిత్ బోస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మెటా ప్రత్యర్థి స్నాప్‌లో ఆయన చేరాడు.

  కోత మొదలైంది.. మెటాలో 11 వేల మంది తొలగింపు

  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ ‘‘ కంపెనీలో పనిచేస్తున్న 13 శాతం మంది ఉద్యోగులను తొలగించాం. కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాం. కఠిన నిర్ణయం తీసుకున్నాం. దీనంతటికి నేనే బాధ్యత వహిస్తా. తొలగించిన ఉద్యోగులను క్షమాపణలు కోరుతున్నా’’ అంటూ పేర్కొన్నారు.

  ఒరిజినల్‌ ID కార్డ్‌ ఉంటేనే ఇన్‌స్టా అకౌంట్‌

  దేశంలో ఇకపై ఇన్‌స్టాగ్రాం అకౌంట్ కావాలంటే ఒరిజినల్‌ ఐడీ కార్డ్‌ ఉండాల్సిందే. పుట్టిన తేదీ ధ్రువీకరిస్తేనే ఇన్‌స్టాగ్రాం ప్రొఫైల్‌ క్రియేట్‌ అవుతుంది. లేదా వీడియో సెల్ఫీ ద్వారా వయసు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దేశంలో చిన్న పిల్లలు తప్పుడు డేట్‌ ఆఫ్‌ బర్త్‌తో ప్రొఫైల్స్ క్రియేట్‌ చేసి వాడుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాలో 18+ వయసు వారికి మాత్రమే ఉండే కంటెంట్‌ను చిన్నపిల్లలు చూసి తప్పుదారి పడుతున్నారు. దీనిని నివారించేలా మెటా టెస్టింగ్‌ ప్రారంభించింది.

  ఉగ్రవాద జాబితాలో ఫేస్‌బుక్‌

  ప్రముఖ సంస్థ మెటాను రష్యా ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాల సంస్థల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది మార్చిలో మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంను బ్యాన్‌ చేసిన మాస్కో…తాజాగా మెటాపై ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాపై వ్యతిరేకత పెంచే పోస్టులను ఇవి ప్రచారం చేస్తున్నాయని రష్యా ఆరోపిస్తుంది. విద్వేషపూరిత కంటెంట్‌ను కట్టడి చేసే యంత్రాంగం మెటాకు లేదని చెబుతోంది. దీనిపై మెటా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

  ‘మెటా’కు భారీ జరిమానా

  పేటెంట్‌ని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వాకీ-టాకీ యాప్ మేకర్స్‌ డెవలప్ చేసిన లైవ్ స్ట్రీమింగ్ పేటెంట్‌లను ఫేస్‌బుక్, ఇన్‌స్టా లైవ్ ద్వారా మెటా ఉల్లంఘించింది. దీంతో 174.5మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ జరిమానాతో మెటాపై భారీగా భారం పడనుంది. వాకీ-టాకీ అధినేత కేటిస్ సైనికుడిగా పనిచేశారు.

  గూగుల్, మేటాలకు ఫైన్

  దక్షిణ కొరియా పౌరులకు సంబంధించిన డేటాను గూగుల్, మేటాలు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆ దేశం గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ గూగుల్, మేటాలకు 71 మిలియన్ల డాలర్ల జరిమానా విధించినట్లు సౌత్ కొరియా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ యూఎస్ బేస్‌డ్ టెక్ దిగ్గజాలు సౌత్ కొరియా పౌరుల డేటా ఉపయోగించి వివిధ అప్లికేషన్ల ద్వారా అనధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గూగుల్‌కు 49.7, మేటాకు 22.1 మిలియన్ డాలర్ల చొప్పున ఆ దేశం జరిమానా విధించింది. కాగా ఈ విషయంపై టెక్ దిగ్గజాలు కోర్టులో అప్పీల్‌కు … Read more

  మొదటిసారిగా నష్టాలు చవిచూసిన మెటా

  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృత్వ సంస్థ ‘మెటా’ మొదటిసారిగా నష్టాలను చవిచూసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 1పర్సెంట్ పడిపోయి 28.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ నికర ఆదాయం కూడా 36 శాతం పడిపోయిందని, అదే సాయంలో ఖర్చులు 22 శాతం అధికంగా పెరిగాయని హాలీవుడ్ రిపోర్టర్ నివేదించింది. ప్రకటనలు తగ్గడంతో తమ ఆదాయం తగ్గిందని.. దీని కారణంగా తాము తమ పెట్టుబడుల వేగాన్ని నెమ్మదిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ వెల్లడించారు.

  Meta shares take an unprecedented beating as Facebook loses followers for the first time

  The rise and rise of Mark Zuckerberg-led Facebook were stopped in its tracks by an unprecedented and unexpected fall in its daily user numbers, which led to a dramatic fall in the share price of the recently renamed company that now goes by the name of Meta. Facebook shares fell by a sizeable 25% on Thursday, in the process wiping … Read more