• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NED vs BAN: నెదర్లాండ్స్ ఘన విజయం

    నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో బంగ్లాను నెదర్లాండ్స్‌ ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 142 పరుగులకే ఆలౌట్ అయింది. మెహదీ హసన్ మిరాజ్ (35) తప్పా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4, బాస్‌ డీ లీడే 2, ఆర్యన్ దత్‌, వాన్‌ బీక్, అకెర్మాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

    BAN vs NED: నెదర్లాండ్స్ ఆలౌట్

    ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాక్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లు స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (68), వెస్లీ బరేసి (41) సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35) మిగిలిన బ్యార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిపుల్ ఇస్లామ్ 2, ముస్తాఫిజుర్ రహ్మన్‌ 2, మెహదీ హసన్ 2, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్ పడగొట్టారు

    AUS vs NED: ఆసీస్ ఘన విజయం

    నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లకే 90 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. చాలా మంచి ఒక అంకె స్కోరుకే పరిమితమైయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో వరల్డ్ కప్‌లో మూడో విజయాన్ని నమోదుచేసుకుంది.

    సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    పసికూన నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ మొదట్లో తడబడినా తర్వాత బాగానే పరుగులు రాబట్టింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు గట్టిసవాల్‌ విసిరిరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నెదర్లాండ్స్ స్పిన్ దాటికి నిలవలేకపోయారు. సౌతాఫ్రికా 42.5 ఓవర్లకు ఆలౌటై 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో … Read more

    సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    పసికూన నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ మొదట్లో తడబడినా తర్వాత బాగానే పరుగులు రాబట్టింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు గట్టిసవాల్‌ విసిరిరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నెదర్లాండ్స్ స్పిన్ దాటికి నిలవలేకపోయారు. సౌతాఫ్రికా 42.5 ఓవర్లకు ఆలౌటై 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో … Read more

    SAvsNED: సౌతాఫ్రికా టార్గెట్ ఫిక్స్

    ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ బ్యాటర్లు విక్రమ్‌జిత్ సింగ్ (2), బాస్‌ డీ లీడే (2) సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (19), మాక్స్‌ ఔడౌడ్ (18), కోలిన్ అకెర్‌మాన్ (13) తేజ నిడమనూరు (20) స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులతో రాణించారు.

    టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత నెదర్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది, గత మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా, నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.