NED vs AFG: అప్గాన్ ఘన విజయం
వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. 31.3 ఓవర్లలోనే 181/3 స్కోరు చేసి టార్గెట్ ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా (52), హష్మతుల్లా (56) అర్ధశతకాలతో రాణించారు. అజ్మతుల్లా 31*, ఇబ్రహీం జడ్రాన్ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. నెదర్లాండ్ బౌలర్లలో లొగాన్, రోలోఫ్, జుల్ఫికర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆఫ్గాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.