• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అరుదైన రికార్డులు సాధించిన రోహిత్ శర్మ

  న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే, టీ20 సిరీస్‌ల్లో కివీస్ జట్టుని వైట్‌వాష్ చేసిన ఏకైక భారత కెప్టెన్‌గా అవతరించాడు. 2021లో భారత్ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌ని రోహిత్ సారథ్యంలోని టీమిండియా వైట్‌వాష్ చేసింది. మరోవైపు, సొంతగడ్డపై అత్యధిక సిరీస్‌లు(కనీసం 3 మ్యాచ్‌లు) వైట్‌వాష్ చేసిన కెప్టెన్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 7 సిరీస్‌లను వైట్ వాష్ చేయగా.. రోహిత్ 8 సిరీసుల్లో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(30) … Read more

  మూడో టీ20కి కేన్ దూరం

  భారత్‌తో తుది టీ20 పోరుకు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ విలియమ్సన్ నేడు జరిగే మూడో టీ20కి అందుబాటులో ఉండట్లేదు. వైద్య చికిత్స కోసం విలియమ్సన్ ఇదివరకే అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో టీ20కి ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ నాయకత్వం వహిస్తాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. విలియమ్సన్ స్థానంలో మరో బ్యాటర్ చాప్‌మన్ జట్టులోకి రానున్నాడు. కాగా, రెండో టీ20లో విలియమ్సన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా కేన్ క్రీజులో నిలబడి స్కోరు బోర్డును ముందుకు … Read more

  వావ్.. సౌధీ సూపర్ బౌలింగ్

  న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌధీ అద్భుతం చేశాడు. టీ20ల్లో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీసుకుని భారత స్కోరు బోర్డును నిలువరించాడు. 20వ ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు టుడీలు రాగా, మూడో బంతికి హార్దిక్ పాండ్యాను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాని షార్ట్ ఫైన్ లెగ్‌లో దొరకబుచ్చుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ లాంగ్ ఆన్‌లో ఫెర్గూసన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సౌధీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. … Read more

  పాక్ అంటే కివీస్‌కు వణుకు

  ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ అంటే న్యూజిలాండ్‌కు వణుకు పుడుతోంది. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఈ రెండు జట్టు నాలుగుసార్లు తలపడ్డాయి. అన్నిసార్లు పాకిస్తానే గెలిచింది. 1992, 1999 వన్డే ప్రపంచకప్, 2007,2022 టీ20 ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్ సెమీస్‌లో పరాజయం మూటగట్టుకుంది. దీనిపై సగటు అభిమానికి సందేహం వస్తోంది. పాక్‌తో సెమీస్ మ్యాచ్ అంటే కివీస్ ఒత్తిడికి గురవుతోంది. ఆ ఒత్తిడిలో పేలవ ఫీల్డింగ్, క్యాచ్‌లు జారవిడుస్తోంది.

  ఫీల్డింగే న్యూజిలాండ్ కొంప ముంచిందా?

  ‘క్యాచెస్ విన్స్ మ్యాచెస్’ అని అంటుంటారు. క్రికెట్‌లో ఒక్క క్యాచ్‌ని జార విడిచినా జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌తో సెమీఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‌కు ఇదే గతి పట్టింది. 152 పరుగులను కాపాడుకోవడానికి మైదానంలోకి వచ్చిన కివీస్ ఆదిలోనే అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఈ మ్యాచులో అర్ధ సెంచరీతో చెలరేగిన బాబర్ అజామ్.. వాస్తవానికి ఖాతా తెరవకుండానే వెనుదిరిగే వాడు. సున్నా పరుగుల వద్ద బాబర్ క్యాచ్‌ నేలపాలు అయింది. ఇవే కాకుండా మరో రెండు క్యాచులు మిస్సయ్యాయి. ఇలా ఫీల్డింగ్ ప్రదర్శన … Read more

  శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం

  టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్ రేసులో దూసుకెళ్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో గ్రూపు 1లో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రత్యర్థిరి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్ అద్భుత శతకం చేశాడు. ఇక బౌలింగులో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. బౌల్ట్ 4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. సౌధీ, సోది, ఫెర్గూసన్ రాణించారు. స్కోర్లు NZ 165/7; SL 102/10.

  ఆకట్టుకుంటున్న NZ జెర్సీ

  T20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ సిద్ధమవుతోంది. విలియమ్సన్ సేన ఈ మేరకు సన్నాహకాలు ప్రారంభించింది. తాజాగా ఆ జట్టు ప్రపంచకప్ జెర్సీని ఆవిష్కరించింది. భుజాలపై బూడిద వర్ణంలో, ఛాతి కింది నుంచి నలుపు రంగుతో ఉన్న జెర్సీ ఆకట్టుకుంటోంది. వరుసగా మూడో సారీ టీ20 ప్రపంచకప్‌కు కేన్ విలియమ్సన్ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. ప్రపంచకప్‌లో అక్టోబరు 19న భారత్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం గ్రూపు దశలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌లతో తలపడనుంది.

  అందుకే కాంట్రాక్టు వద్దన్నా

  విదేశీ లీగుల్లో ఆడటానికి ఒప్పందం కుదుర్చుకుని.. సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్. న్యూజిలాండ్ బోర్డు ఇచ్చే ఈ కాంట్రాక్టును తిరస్కరించ డంతో ఈ ఆటగాడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందిస్తూ.. ముందుగానే విదేశీ లీగ్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. జట్టులో స్థానం కోల్పోయాకే.. వేరే లీగ్‌లకు సైన్ చేసినట్లు నీషమ్ తెలిపాడు.

  న్యూజిలాండ్‌తో పోరు కీలకమెందుకంటే..

  టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ను ఓటమితో మొదలు పెట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం పొందింది. అదే సమయంలో మన గ్రూపులో ఉన్న మరో స్ట్రాంగ్ కెంటెండర్ అయిన న్యూజిలాండ్ కూడా పాక్ మీద తన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అక్టోబర్ 31 ఆదివారం దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ పోరులో గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన … Read more