ఈ హోటల్‌కు వెళ్తే చుక్కలు కనిపిస్తాయి
ప్రపంచంలో జరిగే కొన్నికొన్ని పనులు వింతగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్ ఓ వినూత్న హోటల్‌ను రూపొందించారు. ఈ హోటల్లో గోడలు ఉండవు, రూప్ ఉండదు, ఎలాంటి గదులు ఉండవు కేవలం ఆరుబయట ఓ బెడ్ మాత్రమే ఉంటుంది. ఆరు బయట పడుకొని ఆకాశాన్ని ఆస్వాదించేందుకే ఈ హోటల్‌ను రూపొందించామని వారు తెలిపారు. కాగా ఈ హోటల్లో బస చేయాలంటే రాత్రికి రూ.27 వేలు చెల్లించాల్సి ఉంటుంది.