• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డులో కీలక పరిణామం

    పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీసీబీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ తన పదవికి రాజీనామా చేశాడు. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు, ఇంజమామ్‌కు చెందిన ఏజెన్సీ తరఫున ఆటగాళ్లనే జట్టులోకి తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టడానికి పీసీబీ ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

    ‘ఐదు నెలలుగా పాక్‌ ఆటగాళ్లకు జీతాలు లేవు’

    పాక్‌ ఆటగాళ్ల వేతనాలపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్‌ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆటగాళ్లకు పీసీబీ బోర్డు నుంచి సరైన సహకారం లేదని చెప్పారు. గత ఐదు నెలలుగా క్రికెటర్లకు జీతాలు చెల్లించడం లేదన్నారు. తమ జీతాల గురించి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ పీసీబీ ఛైర్మన్‌కు లేఖలు రాసినా స్పందన లేదని చెప్పారు. ఆటగాళ్లకు జీతాలు అందించనప్పుడు. వారు ఎలా ఆడతారని లతీఫ్ ప్రశ్నించారు. వారి పట్ల పీసీబీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని పేర్కొన్నారు.