‘యానిమల్’ ప్రీ-టీజర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నయా మూవీ ‘యానిమల్’ ప్రీ-టీజర్ వచ్చేసింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 50 సెకన్ల పాటు ఉన్న ప్రీ-టీజర్ ఎంతో వైలెంట్‌గా ఉంది. యానిమల్ చిత్రంలో హీరోయిన్‍గా రష్మిక మందన్న నటిస్తుండగా.. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 11వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.