• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘వ్యూహం’ ట్రైలర్‌పై ఫిర్యాదు

  దర్శకుడు రాంగోపాల్‌వర్మపై టీడీపీ నేత గంగాధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ తీసిన వ్యూహం సినిమా ట్రైలర్‌ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లను కించపరిచేలా ఉందని తెలిపారు. ఇరు పార్టీల కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలా పలు అభ్యంతర వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాటల్లోని కొన్ని పదాలు కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. రాంగోపాల్‌వర్మ సహా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌, నటీనటులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో గంగాధర్ ఫిర్యాదు చేశారు.

  నారా లోకేశ్‌పై ఆర్జీవీ సెటైర్లు

  AP: టీడీపీ నేత నారా లోకేశ్‌ తనపై చేసిన విమర్శలపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. లోకేశ్‌ను చూసి నవ్వాలా? జాలి పడలా? నవ్వాలా? ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు పరిస్థితి చూసి లోకేశ్‌ మైండ్‌ స్టబిలైజ్‌ అయ్యిందేమో అని విమర్శించారు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదేమో అని సలహా ఇచ్చారు. సబ్జెట్‌ తెలియకుండా మాట్లాడితే మీ తండ్రిని దేవుడు కూడా కాపాడలేడని ఆర్జీవీ అన్నారు. కొద్ది రోజులు లండన్‌కు వెళ్లి రెస్ట్‌ తీసుకోవాలని లోకేశ్‌కు సూచించారు. Hey @NaraLokesh … Read more

  ఇదే నా చివరి రాజకీయ చిత్రం: వర్మ

  ‘వ్యూహం’ సినిమా తర్వాత అదే నా చివరి రాజకీయ చిత్రమని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ‘వ్యూహం’ ట్రైలర్ విడుదల సందర్బంగా ఆయన మట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబును తానేప్పుడూ కలవలేదని చెప్పారు. ఆయనతో ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. తనకు ఏపీ రాజకీయ పరిస్థితులపై పెద్దగా అవగాహణ లేదని చెప్పారు. వ్యూహంలో ఇద్దరు వ్యక్తుల మధ్య దృష్టికోణాన్ని మాత్రమే ఆవిష్కరించామని చెప్పుకొచ్చారు. సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమా రూపొందించామని వర్మ చెప్పుకొచ్చారు.

  జగన్‌పై అభిమానంతో సినిమా తీశా: RGV

  ‘వ్యూహం’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు నిజం మాత్రమే ఉంది.. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది.. వైఎస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న జీవితాలను సినిమా తీయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. నేను లక్ష్మిస్ ఎన్టీఆర్, సర్కార్ సినిమాలు అలా తీసినవే. నేను వైఎస్‌ జగన్ మీద ఉన్న అభిమానంతో సినిమా … Read more

  అర్థం కాని విధంగా ఆర్జీవీకి విషెస్

  ఆర్జీవీ అంటేనే విచిత్రం. ఎప్పుడు ఏ విషయంపై ఏ విధంగా స్పందిస్తాడో ఊహించలేం. తనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ అభిమాని చేసిన [ట్వీట్‌](url)పై వర్మ వినూత్నంగా స్పందించాడు. ఓ కవితతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా.. ‘చాలా బాగుంది. అర్థం అయితే ఇంకా బాగుండేది’ అంటూ ఆర్జీవీ రిప్లై ఇచ్చాడు. వోడ్కా విత్ వర్మ పుస్తక రచయిత సిరాశ్రీ చేసిన ట్వీట్‌కి వర్మ ఈ విధంగా స్పందించాడు. వర్మ రిప్లైకి సిరాశ్రీ స్పందిస్తూ.. ‘మీకు అర్థం కాని భాషలో రాయడం ఒక ఆనందం’ … Read more

  నటి కాళ్ల వద్ద రామ్‌ గోపాల్‌ వర్మ

  రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఏదో ఒక పనితో సంచలనంగా మారుతుంటారు. ఇప్పుడు మరోసారి ఈ దర్శకుడు వార్తల్లో నిలిచారు. తన డేంజరస్‌ సినిమా ప్రచారంలో భాగంగా నటి అషూ రెడ్డి కాళ్ల వద్ద కూర్చున్నారు. ఇందులో వివిధ అంశాల గురించి చర్చించారు. సినిమాకు సంబంధించిన విషయాలు తెలియజేశారు. ఎక్కువగా బోల్డ్ కంటెంట్‌ ఉన్న విషయాలను మాట్లాడుకున్నారు. డేంజరస్‌ అషూ రెడ్డితో తన ఇంటర్వూ అని ట్విటర్‌లో షేర్ చేశాడు.

  దీపావళి.. 18ట్వీట్లు చేసిన RGV

  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో తనదైన శైలిలో దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు 18 ట్వీట్లు చేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. ‘చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి అయితే.. సూర్యుడికి ప్రతిరోజూ దీపావళే కదా?’ అంటూ ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ‘ఈ దీపావళి సందర్భంగా దేవుడు మీకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలి. ఒకవేళ మీరు జబ్బుపడినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం జరిగేలా చూడాలని కోరుతున్నా’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. Tweets by RGVzoomin

  ఆర్జీవీ వరుస ట్వీట్లు.. వైరల్

  రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ఆర్జీవీ మరోరకంగా స్పందించారు. ఒక మహానటుడు చనిపోతే.. షూటింగ్ లు నిలిపివేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. రేప్పొద్దున ఇదే దుస్థితి నేటి తరం నటులకు ప్రాప్తిస్తుందని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు. గొప్ప కళాకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కృష్ణంరాజు వంటి పెద్దవాళ్లకి విలువనిద్దామని.. షూటింగులు రెండు రోజులు నిలుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. నేను కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, @urstrulyMahesh @PawanKalyan @KChiruTweets @themohanbabu బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం … Read more