నాని కొత్త సినిమా టైటిల్ వచ్చేసిందోచ్..!
‘NANI 31’ చిత్రం టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘సరిపోదా శనివారం’ అనే పేరును సినిమాకు ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్, గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ గ్లింప్స్ వీడియో ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ నటించనుంది. విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు.