‘ఓజీ’లోకి ఎంటరైన హీరో విశాల్ వదిన!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో వెర్సటైల్ నటి శ్రియా రెడ్డి నటిస్తోంది. ఈ సినిమా కథ విన్న 5 నిమిషాల్లోనే ఓకే చెప్పినట్లు శ్రియాా తెలిపింది. ఈ సినిమాలో తన రోల్ అద్భుతంగా ఉంటుందని చెప్పింది. ‘ఓజీ’ మూవీని సుజీత్ తెరకెక్కిస్తున్నారు. కాగా కోలీవుడ్ హీరో విశాల్ అన్న విక్రమ్ కృష్షారెడ్డి భార్యే శ్రియారెడ్డి. ‘పొగరు’ సినిమాలో విశాల్ సరసన హీరోయిన్గా నటించింది.