• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIVE: తారకరత్న అంతిమ సంస్కారాలు

    23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన నటుడు తారకరత్న అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఫిల్మ్‌ చాంబర్‌లో ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్దం ఉంచారు. నందమూరి అభిమానులు కడచూపు కోసం తరలివెళ్తున్నారు.

    తారకరత్న భౌతికకాయానికి కొడాలి నాని నివాళి

    [వీడియో;](url) నందమూరి తారకరత్న భౌతికకాయానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలసి ఆయన నందమూరి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా రాజకీయపరంగా నందమూరి కుటుంబసభ్యులతో విభేధించినా వారి ఇంట్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగినా హాజరవుతుంటారు. నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు కూడా అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కొడాలి నాని అక్కడే ఉన్నాడు. Kodali Nani Pays Tributes To Tarak Ratna#RipTarakRatnaGaru pic.twitter.com/JXaG5zyRZm — ?J A G U N ༆king ? (@YS_JAGAN_2024) February 19, … Read more

    వెక్కి వెక్కి ఏడ్చిన తారకరత్న కూతురు

    [VIDEO](url):నందమూరి తారకరత్న గుండెపోటుతో అకాలమరణం పొందారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహంలో పార్థివదేహాన్ని సన్నిహితులు, కుటుంబసభ్యుల సందర్శనార్థం ఉంచారు. దేహం వద్ద ఆయన భార్య అలేఖ్య, కూతురు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎక్కి ఎక్కి ఏడ్చిన తారకరత్న కూతురు?#NandamuriTarakaRatna #TarakaRatna #RIPTarakaRatna #Tollywood #SumanTV pic.twitter.com/wLb4P7TcHX — SumanTV (@SumanTvOfficial) February 19, 2023

    తారకరత్న ఇంటికి చేరుకున్న ఎన్టీఆర్‌

    [VIDEO](url): తారకరత్న కడచూపు కోసం కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి తరలివెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న స్వగృహానికి జూ. ఎన్టీఆర్ చేరుకున్నారు. .@tarak9999 & @NANDAMURIKALYAN at #tarakaratna house ???pic.twitter.com/YvaixtxXAt — Nellore NTR Fans (@NelloreNTRfc) February 19, 2023

    కోలుకుంటున్న తారకరత్న; ఎంపీ విజయసాయిరెడ్డి

    నందమూరి తారకరత్న కోలుకుంటున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని విజయసాయి తెలుసుకున్నారు. బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్నను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్పారు. కాగా తారకరత్నకు విజయసాయిరెడ్డి మామ వరుస అవుతారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలి కూతురే అలేఖ్య.

    తారకరత్న ఫైటర్; మంచు మనోజ్

    నందమూరి తారకరత్న ఓ ఫైటర్ అని.. ఆయన కోలుకుని మన ముందుకు వస్తారని ప్రముఖ హీరో [మంచు మనోజ్](url) అన్నారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్నను మనోజ్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఆయన కోలుకుంటున్న తీరుకు వైద్యులు సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పారు. పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని కోరుకున్నారు. కాగా యువగళం యాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. . @HeroManoj1 Anna About "#TarakaRatna Anna Health Condition ? pic.twitter.com/BMSDyEHxDy — VishnuVarthanReddy?CEO … Read more

    నా తమ్ముడు NTRకు పోటీకాను: తారక రత్న

    జూ.ఎన్టీఆర్ గురించి తారకరత్న గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జూ.ఎన్టీఆర్‌కు పోటీగా తాను సినిమా రంగంలోకి వచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదన్నారు. సినిమాల్లోకి రావడం నా కళ. నందమూరి ఫ్యామిలీ నిలబడిందంటే జూ. ఎన్టీఆర్ ఒక కారణం. ఎన్టీర్, కళ్యాణ్ రామ్ నందమూరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు తమ్ముడు ఎన్టీఆర్‌ను చూస్తే గర్వంగా ఉంది అని తారకరత్న చెప్పారు.

    విషమించిన తారకరత్న హెల్త్… ఆస్పత్రికి జూ.ఎన్టీఆర్

    [VIDEO](url): తారకరత్న ఆరోగ్యం మరింత విషమించింది. కాసేపట్లో ఆయన ఆరోగ్యం గురించి హెల్త్ బులెటిన్ వైద్యులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర నందమూరి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అభిమానులు సైతం భారీగా చేరుకున్నారు. తారకరత్నకు ECMO ద్వారా చికిత్స అందిస్తున్నట్లు హృదయాలయ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు వెల్లడించారు NTR @tarak9999 & @NANDAMURIKALYAN at Narayana Hrudayala, Blr to visit #TarakaRatna pic.twitter.com/c0NkrPcEsV — Nandamurifans.com (@Nandamurifans) January 29, 2023

    లోకేశ్ పాదయాత్ర; సొమ్మసిల్లి పడిపోయిన హీరో

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో హీరో నందమూరి తారకరత్న [సొమ్మసిల్లి](url) పడిపోయాడు. ఏపీలోని కుప్పం సమీపంలో ఉన్న లక్ష్మీపురం మసీదులో లోకేశ్, తారకరత్న పూజలు నిర్వహించారు. అనంతరం బయటకు వచ్చే క్రమంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా తారకరత్న ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. Tarakaratna: లోకేశ్ పాదయాత్రలో అపశృతి – కళ్లు తిరిగి పడిపోయిన నటుడు తారకరత్న … Read more