• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస‌క్తిక‌రంగా ‘ర‌హ‌స్య’ టీజ‌ర్‌

    నివాస్ సిస్తు, సారా ఆచార్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘ర‌హ‌స్య’ టీజ‌ర్ రిలీజ్ అయింది. హీరో, హీరోయిన్ ఇద్ద‌రూ పోలీసాఫీస‌ర్లుగా న‌టించారు. ఒక తీవ్ర‌వాది ప‌ట్టుకునే మిష‌న్‌లో భాగంగా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు టీజ‌ర్ చూస్తూ తెలుస్తుంది. శివ శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సునీల్ క‌శ్య‌మ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎస్ఎస్ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మి. ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి, త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    ‘విక్ర‌మ్ వేద’ టీజ‌ర్ రిలీజ్..అద‌ర‌గొట్టిన సైఫ్‌, హృతిక్

    బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ ‘విక్ర‌మ్ వేద’ టీజ‌ర్ రిలీజ్ అయింది. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో సైఫ్‌, గ్యాంగ్‌స్ట‌ర్‌గా హృతిక్ న‌టించారు. టీజ‌ర్‌లో హృతిక్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. త‌మిళ్‌లో మాధ‌వ‌న్, విజ‌య్‌సేతుప‌తి న‌టించిన సూప‌ర్‌హిట్ మూవీ విక్ర‌మ్ వేద రీమేక్‌గా దీన్ని తెర‌కెక్కించారు. ఆ సినిమా డైరెక్ట‌ర్లు పుష్క‌ర్, గాయ‌త్రి హిందీలో కూడా తెర‌కెక్కిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విక్ర‌మ్ వేద‌ విడుద‌ల కానుంది.

    క‌ళాపురం.. ఇక్క‌డ అంద‌రూ క‌ళాకారులే

    ‘క‌ళాపురం’ మూవీ టీజ‌ర్ నేడు విడుద‌ల అయింది. స‌త్యం రాజేశ్, చిత్రంశ్రీను త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. క‌రుణ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌ళాపురం అనే గ్రామంలో సాగే పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైనింగ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 26న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. జీ స్టూడియోస్, ఆర్‌4 మూవీస్ దీన్ని నిర్మిస్తున్నాయి.

    స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ’ మూవీ టీజ‌ర్ విడుద‌ల

    స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్న ‘కృష్ణ‌మ్మ’ మూవీ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. అతిరా రాజి హీరోయిన్‌గా న‌టిస్తుంది. స‌త్య‌దేవ్ మొద‌టిసారిగా పూర్తిస్థాయి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర‌ల్‌లో న‌టిస్తున్నాడు. మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. కాళ భైర‌వ మ్యూజిక్ అందిస్తున్నాడు. వి.వి గోపాల కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

    ధ‌నుష్ ‘సార్’ టీజ‌ర్ రిలీజ్

    ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న సార్ మూవీ టీజ‌ర్ రిలీజైంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో టీజ‌ర్ అదిరిపోయింది. ‘విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది, దాన్ని అంద‌రికీ పంచిపెట్టండి. ఫైవ్ స్టార్ హోటల్‌లో డిష్‌లాగా అమ్మ‌కండి’ అని ధ‌నుష్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ధ‌నుష్ విద్యావ్య‌వ‌స్థ‌లో జ‌రుగుతున్న మాఫియాపై పోరాడే ఒక కాలేజీ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జీవీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

    శ్రీ విష్ణు మూవీ ‘అల్లూరి’ టీజ‌ర్ విడుద‌ల‌

    శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తున్న ‘అల్లూరి’ మూవీ టీజ‌ర్‌ను నేడు విడుద‌ల చేశారు. అల్లూరి సీతారామారాజు జ‌యంతి సంద‌ర్భంగా దీన్ని రిలీజ్ చేసిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. శ్రీ విష్ణు ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌య‌దు లోహోర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌నికెళ్ల భ‌ర‌ణి, సుమ‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నాడు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

    మొద‌టిసారిగా తండ్రితో క‌లిసి న‌టిస్తున్న మంచు ల‌క్ష్మీ..’అగ్నిన‌క్ష‌త్రం’ టైటిల్ ఫిక్స్‌

    సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబు, ఆయ‌న కూతురు మంచు ల‌క్ష్మీ ఒక సినిమాలో న‌టిస్తున్న అగ్నిన‌క్ష‌త్రం టైటిల్‌ను నేడు రివీల్ చేశారు. మంచు ల‌క్ష్మీ మొద‌టిసారి త‌న తండ్రితో క‌లిసి న‌టిస్తుండ‌టం విశేషం . సముద్రఖని, సిద్ధిక్, విశ్వంత్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ క‌థ‌ను డైమండ్ ర‌త్న‌బాబు అందించ‌గా.. ప్రతీక్ ప్రజోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లిజో కె జోస్ సంగీతం అందిస్తున్నాడు.

    హృద‌యాల‌ను క‌దిలిస్తున్న అల్ల‌రి న‌రేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ మూవీ టీజ‌ర్‌

    అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేడు ఆయ‌న న‌టిస్తున్న 59వ సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ టీజ‌ర్ రిలీజ్ చేశారు. అట‌వి గ్రామాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల‌ను ఓటు వేయాల‌ని వెళ్లే అధికారికి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతాయి. అక్క‌డ ప్ర‌జ‌ల జీవ‌న‌స్థితీ, క‌ష్టాలు తీర్చేందుకు హీరో ఏం చేశాడో తెలియ‌జెప్పే క‌థ ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం. ఈ సినిమాతో అల్ల‌రి న‌రేశ్ మ‌రోసారి సీరియ‌స్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. జాంబి రెడ్డి ఫేమ్ ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏఆర్ మోహ‌న్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. … Read more