అందరినీ గుర్తు పెట్టుకుంటా: వైష్ణవి చైతన్య
తన కెరీర్‌లో సాయపడిని ప్రతి ఒక్కరినీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్నారు. ‘‘యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు నేను పెద్ద స్టార్ అవుతానని అందరూ అంటుండేవారు. నాకు ఆ సత్తా, టాలెంట్ ఉందని చెప్పేవారు. ఇలా నాకు అండగా నిలిచిన అందరికీ థ్యాంక్స్. నా జర్నీలో ఉన్న ఘటనలు, మనుషులను ఎప్పటికీ మర్చిపోను. నన్ను బేబీ సినిమాలో ఇంతలా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు.’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.