ఎయిర్‌పోర్టులో ట్రెడీషనల్ లుక్‌లో రణ్‌బీర్, ఆలియా
రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరూ ట్రెడీషనల్ లుక్‌లో కనిపించారు. వారితో పాటు దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో సందడి చేసిన ఈ జంట తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. నాగార్జున, అమితాబ్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.