• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ప్రేమ్ కుమార్’ ట్రైలర్ రిలీజ్

    సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ మూవీట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. లవ్ అండ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా మారాడు. శివప్రసాద పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    థ్రిల్లింగ్‌గా ‘హత్య’ ట్రైలర్

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘హత్య’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ‘‘జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవాల్సిందే’’ అంటూ ఆంటోని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని బాలాజీ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ నెల 21న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ఆసక్తిగా ధోనీ ‘LGM’ ట్రైలర్

    భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మిస్తోన్న ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడ్) మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ వేడుకను చెన్నైలో గ్రాండ్‌గా జరిపారు. ఈ ఈవెంట్‌లో ధోనీ, ఆయన సతీమణి సాక్షి మెరిశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో హరీశ్ కళ్యాణ్ హీరోగా, ఇవానా హీరోయిన్‌గా నటించింది. రమేశ్ తమిళమణి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నదియా కీలకపాత్రలో నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

    ఆసక్తిగా ‘బేబీ’ ట్రైలర్

    ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంది. వెరైటీ ప్రేమ కథాచిత్రంగా ‘బేబీ’ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. సాయిరాజేశ్ దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ‘రుద్రమాంబపురం’ ట్రైలర్ రిలీజ్

    మహేష్ బంటు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమాంబపురం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. మత్స్యకారుల జీవన విధానంపై ఈ సినిమా తీశారు. ఈ చిత్రాన్ని నండూరి రాము నిర్మించారు. ఈ సినిమాలో శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేశ్, పలాస జనార్థన్, నండూరి రాము, సాయి, ప్రమీల తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    ఆకట్టుకుంటున్న ‘రంగబలి’ ట్రైలర్

    టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘‘బయటి ఊళ్లో బానిసలా బతికినా ఫర్లేదు భయ్యా.. కానీ సొంతూరిలో సింహంలా ఉండాలి.’’ అంటూ నాగశౌర్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. పవన్ బాసంశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. జూలై 7న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    థ్రిల్లింగ్‌గా ‘రుద్రంగి’ ట్రైలర్!

    జగపతిబాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ‘రుద్రంగి’ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ‘బాహుబలి’ డైలాగ్ రైటర్ అజయ్ సామ్రాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విమలా రామన్, ఆశిష్ విద్యార్థి, కాలకేయ ప్రభాకర్, గానవి లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 7న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

    ‘స్పై’ ట్రైలర్ వచ్చేసింది

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘స్పై’ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇవాళ సాయంత్రం మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. నిఖిల్ యాక్టింగ్ అదరగొట్టాడనే చెప్పాలి. కాగా ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యమీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేశాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు.

    ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్ హీరోయిన్‌గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజైంది. తిరుపతిలో ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేదికపైనే ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఫైనల్ ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించారు. టీ సీరీస్ ఫిల్మ్ సంస్థ నిర్మించింది.

    ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్ హీరోయిన్‌గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజైంది. తిరుపతిలో ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేదికపైనే ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఫైనల్ ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించారు. టీ సీరీస్ ఫిల్మ్ సంస్థ నిర్మించింది.