• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విశ్వక్ ‘ధమ్కీ’ ఇచ్చేశాడుగా!

    మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ధమ్కీ’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను నటసింహిం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చిత్రంలో విశ్వక్ డ్యూయెల్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేధా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. రావు రమేష్, రోహిణీ, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశ్వక్ స్వీయ దర్శకత్వం చేపట్టిన ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

    ‘అందరూ బాగుండాలి..అందులో నేనుండాలి’ ట్రైలర్ రిలీజ్

    ఆలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అందరూ బాగుండాలి..అందులో నేనుండాలి’ ట్రైలర్‌ను చిత్ర బృంద విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మెట్రో ట్రైన్‌లో నిద్రపోయిన నరేష్‌ను.. ఆలీ ఫొటో తీసి సోషల్‌మీడియాలో పెడతాడు. దీంతో నరేష్ ఫ్యామిలీ సమస్యలు ఎదుర్కోవటం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవిత్ర లోకేశ్, మనో, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ నెల 28న ఓటీటీ ‘ఆహా’లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

    ఈ నెల 5న ‘జిన్నా’ ట్రైలర్ రిలీజ్

    మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా ట్రైలర్ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మరింత అంచనాలు పెంచింది. విడుదలైన రెండు పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.