వాల్తేరు వీరయ్య టెలివిజన్ ప్రీమియర్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ టెలివిజన్ ప్రిమియర్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా దసర పండుగ సందర్భంగా జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.