• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కోబ్రా’ మూవీ నుంచి ‘త‌రంగిణి’ వీడియో సాంగ్ రిలీజ్

    విక్ర‌మ్ హీరోగా న‌టించిన ‘కోబ్రా’ మూవీ థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. తాజాగా మూవీ నుంచి ‘త‌రంగిణి’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, మృణాళిని ర‌వి హీరోయిన్లుగా న‌టించారు. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు. అజ‌య్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోబ్రా మూవీకి త‌మిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాలో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

    ‘పంచతంత్ర క‌థ‌లు’ నుంచి సూప‌ర్‌హిట్ సాంగ్ రిలీజ్

    ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ మూవీలో నేనేమో మోతేవ‌రి సాంగ్ సూప‌ర్‌హిట్ అయింది. ఈ పాట‌ను రామ్ మిరియాలా పాడాడు. ఈ వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. పంచ‌తంత్ర క‌థ‌లు సినిమాలో వేర్వేరు క‌థ‌ల‌ను ఒక్క‌చోట చూపించారు. నోయ‌ల్, నందిని రాయ్ తదిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. గంగ‌మోని శేఖ‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌మ్రాన్ మ్యూజిక్ అందించాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

    వైష్ణ‌వ్ తేజ్-కేతిక శ‌ర్మ రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్

    వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న ‘రంగ‌రంగ వైభ‌వంగా’ సినిమా నుంచి సిరిసిరిమువ్వ‌ల్లోన అనే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను జావెద్ అలీ, శ్రేయా ఘోష‌ల్ క‌లిసి పాడారు. ఈ సినిమాలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర దీన్ని నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 2న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ‘అంటే సుంద‌రానికి’ నుంచి ‘ఒరోరి సంచారి’ వీడియో సాంగ్ రిలీజ్

    నాని, న‌జ్రియా జంట‌గా న‌టించిన ‘అంటే సుంద‌రానికి’ మూవీ నుంచి ఒరోరి సంచారి వీడియో సాంగ్ రిలీజైంది. జూన్ 10న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమాకు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ మంచి టాక్ ల‌భించింది. నాని, న‌జ్రియా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ మూవీ జులై 8న ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఇది రూపొందింది.

    ‘ప‌క్కా కమ‌ర్షియ‌ల్’ నుంచి ‘అందాల రాశి’ వీడియో సాంగ్ రిలీజ్

    గోపీచంద్ హీరోగా న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి అందాల రాశి అనే రొమాంటికే వీడియో సాంగ్‌ను నేడు రిలీజ్ చేశారు. ఇందులో రాశిఖ్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. మారుతీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు లాయ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని చిత్రబృందం తెలిపింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డు నుంచి U/A స‌ర్టిఫికెట్ ల‌భించింది.