వాంఖడేలో సచిన్ విగ్రహావిష్కరణ
వాంఖడే స్టేడియంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. రేపు ప్రపంచకప్లో భారత్, శ్రీలంక జరుగనుండగా.. ఒకరోజు ముందుగా నేడు సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో వాంఖడే స్టేడియంలో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంసీఏ నిర్ణయించింది. నిన్న ఈ విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు. సీఎం ఏక్నాథ్ షిందే, సచిన్, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.