• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo Y28 5G: తక్కువ బడ్జెట్‌లో వివో 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే!

    చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో (Vivo)కు భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌లో ఆ కంపెనీ ఫోన్లు గుడ్‌విల్‌ కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వివో మరో సరికొత్త మెుబైల్‌తో దేశంలో అడుగుపెట్టింది. సోమవారం (జనవరి 8న) ‘Vivo Y28 5G’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌లో నయా వివో మెుబైల్‌ను కోరుకునే వారు దీన్ని పరిశీలించవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. టెక్‌ ప్రియులకు నచ్చే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఫోన్‌లో ఫిక్స్‌ చేసినట్లు తెలిపాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

    మెుబైల్‌ స్క్రీన్‌

    Vivo Y28 5G మెుబైల్‌ను 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. దీనికి 90Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. MediaTek Dimensity 6020 SoC ప్రొసెసర్‌, Android 13 OSపై ఫోన్‌ వర్క్‌ చేస్తుంది. డస్ట్‌ & వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం IP54 రేటింగ్‌ను ఫోన్‌కు ఇచ్చారు. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    వివో తన కొత్త మెుబైల్‌ను మూడు ర్యామ్‌ వేరియంట్లలో లాంచ్ చేసింది.  4GB RAM + 128GB ROM, 6GB RAM + 128GB ROM, 8GB RAM + 128GB స్టోరేజ్ మోడళ్లలో Vivo Y28 5G లభించనుంది. 

    కెమెరా

    Vivo Y28 5G మెుబైల్‌ను డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 2MP సెన్సార్‌ ఉంది. సెల్పీలు, వీడియో కాల్‌ కోసం ముందు వైపు  8MP ఫ్రంట్‌ కెమెరాను అమర్చారు. వీటి సాయంతో మంచి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని వివో వర్గాలు చెబుతున్నాయి.

    బ్యాటరీ

    Vivo Y28 5G ఫోన్‌ను పవర్‌ఫుల్‌ బ్యాటరీతో తీసుకొచ్చారు. 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని అందించారు. దీని ద్వారా మెుబైల్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చని వివో వర్గాలు చెప్పాయి. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    Vivo Y28 5G మెుబైల్‌లో Wi-Fi, Bluetooth 5.1, USB 2.0 port, GPS, OTG, FM radio, A-GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే యాక్సిలోమీటర్‌, ambient light sensor, డిజిటల్‌ దిక్సూచి, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటి వంటి సెన్సార్లను ఫోన్‌ అందించారు. 

    కలర్ ఆప్షన్స్‌

    Vivo Y28 5G మెుబైల్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. క్రిస్టల్‌ పర్పుల్‌ (Crystal Purple), గ్లిట్టర్ ఆక్వా (Glitter Aqua) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంచుకునే వెసులుబాటు ఉంది. 

    ధర ఎంతంటే?

    Vivo Y28 5G ధరను వేరియంట్ల ఆధారంగా కంపెనీ నిర్ణయించింది. 4GB RAM + 128GB మోడల్‌ ధరను రూ.13,999గా పేర్కొంది. అలాగే 6GB RAM + 128GB రూ.15,499, 8GB RAM + 128GB రూ.16,999గా ఫిక్స్ చేసింది. వివో ఇండియా ఈ-స్టోర్లతో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈకామర్స్‌ సైట్స్‌లో ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. SBI, DBS, IDFC బ్యాంక్‌లకు సంబంధించిన కార్డు కొనుగోళ్లపై రూ.1,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv