ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. తిరుపతి -సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో (ఆదివారం) నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లకు గతంలోని స్టాపేజ్ లు, టైమింగ్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అటు సికింద్రాబాద్-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో నడపనున్నట్లు రైల్వేశాఖ వివరించింది.
తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రైళ్లలో భక్తులు కిక్కిరిసి పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే గతంలోనే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మొన్నటి వరకు ఈ రైళ్లు సేవలు అందించాయి. చాలామంది భక్తులు ఈ సర్వీసుల ద్వారా తిరుపతికి వెళ్లి శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు. స్పెషల్ రైళ్ల గడువు ముగుస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే ఈ సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
టైమింగ్స్..
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 07489 నంబర్ గల రైలు ప్రయాణించనుంది. మార్చి 17, 24, 31(శుక్రవారం) తేదీల్లో ఈ రైలు తిరుపతికి బయలు దేరుతుంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్కు 07490 నంబర్ రైలు 19, 26 తేదీల్లో ప్రయాణించనుంది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
ఈ రూట్లో కూడా..
సికింద్రాబాద్ నుంచి దానాపూర్కి వెళ్లే రైలు సర్వీసులను కూడా దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. మార్చి 19, 26వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రైలు బయలు దేరుతుంది. ఈ తేదీల్లో ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ స్టేషను నుంచి ప్రారంభమై మరునాడు ఉదయం 7 గంటలకు దానాపూర్కి చేరుకుంటుంది. దానాపూర్ నుంచి సికింద్రాబాద్కు మార్చి 16, 23వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రాత్రి 8.50 గంటలకు బయలు దేరి మరునాడు ఉదయం 4.40 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!