వేసవి సెలవులు వచ్చాయి. ఈ వారం పెద్ద సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. మణిరత్నం, అక్కినేని అఖిల్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. అంతేకాదు, బ్లాక్ బస్టర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి, ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే వాటి గురించి తెలుసుకుందాం.
ఏజెంట్
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా వస్తున్న ఏజెంట్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా… హిపాప్ తమిజా సంగీతం అందించాడు. ఏకే ఎంట్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించారు. ఈ భారీ యాక్షన్ చిత్రంపై అంచానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
పొన్నియన్ సెల్వన్ 2
పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది PS-2. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా కూడా 28న రిలీజ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఏజెంట్‌తో పోటీ పడుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా.. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. పార్ట్ 2 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.
రారా.. పెనిమిటి
నందితా శ్వేత సింగిల్ క్యారెక్టర్‌లో రూపొందిన సినిమా రారా.. పెనిమిటి. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 28న విడుదలవుతుంది. కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త కోసం ఎదురుచూసే విరహ వేదనే ఈ చిత్రం. తెరపై ఒక్క పాత్రే కనిపించినా.. చాలా పాత్రలు వినిపిస్తాయి.
హాలీవుడ్ ‘శిసు’
హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న హాలీవుడ్ మూవీ శిసు. జల్మరీ హెలెండర్ దర్శకత్వం వహించాడు. జొర్మా తొమ్మిలా, అక్సెల్ హెన్ని, జూన్ డూలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 28న ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా వస్తుంది.
ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
దసరా
నాని హీరోగా వచ్చిన మాస్ పీరియాడికల్ చిత్రం దసరా. మార్చి 30న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సిటాడెల్
అమెరికన్ స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్ తెలుగులో రాబోతుంది. రిచర్డ్ మ్యాడన్, ప్రియాంక చోప్రా నటించిన ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మెుదట తొలి రెండు ఎపిసోడ్‌లను తీసుకువస్తారు. తర్వాత మేలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్ విడుదల చేస్తారు. ఈ సిరీస్ హిందీ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.
వ్యవస్థ
జీ 5 వేదికగా వెబ్ సిరీస్‌లు అలరిస్తున్నాయి. మరో కొత్త వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. న్యాయవ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు ఆనంద్ రంగ్ దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచెరపాలెం, నారప్పతో గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
మరికొన్ని
Title | Category | Language | Platform | Release Date |
Court lady | Series | Hindi | Netflix | April 26 |
Novoland | Series | English | Nerflix | April 26 |
The good bad mother | Series | English | Netflix | April 27 |
Eka | Series | English | Netflix | April 28 |
Before life after death | Movie | English | Netflix | April 28 |
Pathu thala | Movie | Tamil | Amazon prime | April 27 |
U turn | Movie | Hindi | Zee5 | April 27 |
Scream 6 | Movie | English | Book my show | April 26 |
thurumukham | Movie | Malayalam | Sony liv | April 28 |
Save the tigers | Series | Telugu | disney+hotstar | April 27 |
Peter pan and vendi | Series | English | disney+hotstar | April 28 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!