ఒక ఇల్లు ఎలా ఉందో చెప్పాలంటే ముందుగా వంటగది చూడాలంటారు. అతిథులు కూడా వంటగదిని పరిశీలించాకే ఇంటి పరిశుభ్రతపై ఓ అంచనాకు వస్తుంటారు. ఒక ఇంటిలో కిచెన్ ప్రాముఖ్యత అలాంటిది. కేవలం వండుకునే ప్రదేశంగానే కాకుండా ఇంటికి ఆహ్లాదం కలిగించే చోటుగా కిచెన్‌ని భావిస్తారు. వంట గది పాజిటివ్‌గా ఉంటే ఇల్లంత ఆ ఆరా(Aura) వ్యాపిస్తుంది. మరి, మీ వంటిని ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి ఏయే చిట్కాలు పాటించాలో చూద్దాం.
పెయింటింగ్స్
వంటగదిలో గోడలు నల్లగా, మురికిగా కనిపిస్తే అక్కడ క్షణం కూడా ఉండబుద్ది కాదు. ఎక్కువ సమయం కిచెన్లోనే కేటాయిస్తాం గనుక వీలైనంత మేరకు గోడలు బాగుండేలా చూసుకోవాలి. మనసుకు ప్రశాంతతను చేకూర్చే పెయింటింగ్స్ వేయించాలి. డార్క్ రంగులు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, గోడలపై తేలికపాటి, పలుచైన రంగులు వేసుకుంటే బాగుంటుంది. అననుకూల ఎనర్జీని గ్రహించే విధంగా రంగులు ఉండాలి. కానీ, దానిని మరింత ఎక్కువగా ప్రతిబింబించకూడదు. అప్పుడే హాయిగా వంట చేసుకోగలరు. అభిరుచికి అనుగుణంగా గోడలపై వివిధ రకాల డిజైన్లను కూడా పరిశీలించొచ్చు. సాధారణంగా వంటగది గోడలపై ఎల్లో(Yellow), ఆరెంజ్(Orange), గులాబీ(Pink) కలర్స్ ప్రెఫర్ చేయొచ్చు. వీటిని చూస్తే మనసు కుదుట పడుతుంది.
అరేంజ్మెంట్
వంటగదిలో ఉన్నంత గందరగోళం ఎక్కడా కనిపించదు. ఏదైనా వంటకం చేయడానికి దాదాపు అన్ని రకాల వస్తువులు, సామగ్రి, కావల్సిన పదార్థాలు వాడాల్సి ఉంటుంది. దీంతో చెత్త ఎక్కువగా పోగవుతుంది. వీటికి తోడు ఖాళీ చేసిన వంట పాత్రలు పేరుకు పోతాయి. కాబట్టి, ఓపికతో వీటన్నిటినీ క్రమ పద్ధతిలో అరేంజ్ చేసుకోవాలి. కిచెన్‌లో ఉన్న కప్‌బోర్డులు, షెల్ఫ్‌లను వాడుకోవాలి. తరచూ ఉపయోగించే డబ్బాలను చేతికి అందేంత దూరంలో ఉంచుకోవాలి. ఇలా ప్రాధాన్య క్రమంలో సామగ్రిని అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఫలితంగా పాజిటివ్ ఎనర్జీ వెలువడే అవకాశం ఉంటుంది. వంట గదిలో గడపాలన్న ఉత్సాహం రెట్టింపవుతుంది.
లైటింగ్
వంటగదిలో లైటింగ్ చాలా ముఖ్యం. కూరల్లో వేసే ఉప్పు వంటి పదార్థాల మోతాడు కొంచెం అటు, ఇటు అయినా పూర్తిగా చెడిపోతుంది. ఒక్కోసారి సరైన వెలుతురు లేక ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, గదికి లైటింగ్ చాలా ముఖ్యం. సహజమైన వెలుతురు కోసం వెంటినేషన్ చేయించుకోవాలి. వెంటిలేటర్లు, కిటికీలు అమర్చుకోవాలి. అవసరమైతే పొగను బయటకి పంపించే ఎగ్జాస్టర్ ఫ్యాన్లను సెటప్ చేసుకోవాలి. గాలి, వెలుతురు సరిగా వ్యాపించేలా చూసుకోవాలి. అప్పుడే కిచెన్‌లో హాయిగా ఉంటుంది.
గ్యాస్ స్టవ్ పొజిషన్
కిచెన్‌లో గ్యాస్ స్టవ్ పొజిషన్‌పై కూడా ఫోకస్ పెట్టాలి. సాధారణంగా గ్యాస్ స్టవ్‌ని ఆగ్నేయ దిశలో పెడుతుంటారు. ఆగ్నేయంలో అగ్ని దేవుడు ఉంటాడని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి, గదిలో గ్యాస్ స్టవ్‌ని ఈ దిశలో పెట్టే ప్రయత్నం చేయండి. స్టవ్‌తో పాటు సిలిండర్లు, టోస్టర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, రైస్ కుక్కర్ వంటి ఎలక్ట్రానిక్ మేకర్స్‌ని ఒకచోట అమర్చుకునే ప్రయత్నం చేయండి.
పరిశుభ్రత
వంటగదిలో పరిశుభ్రత తప్పనిసరి. ఏ మాత్రం జిడ్డు, మురికి పేరుకుపోయినా దుర్వాసన వ్యాపిస్తుంది. ఫలితంగా వంట చేయాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది. అందుకే, ఎప్పటికప్పుడు కిచెన్‌ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పేరుకు పోయిన మురికిని తొలగించేందుకు ప్రత్యేకమైన లిక్విడ్లను వాడాలి. నూనె, పాల మరకలను వెంటనే తుడిపేస్తే సమస్య ఉండదు. షెల్ఫ్‌లు, కప్‌బోర్డులను కూడా రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండాలి.
మొక్కల పెంపకం
మొక్కలను బాల్కనీలో పెంచుతారు. అయితే, వంటగదిలోనూ ఒకట్రెండు మొక్కలను పెంచాలి. కిచెన్‌లోని గాలిని ఇవి వడపోస్తాయి. కొన్ని మొక్కలను పెంచుకుంటే సౌభాగ్యం కలుగుతుందని కూడా చెబుతుంటారు. ఇలా రెండు రకాలుగా మొక్కల పెంపకం లబ్ధి చేకూరుస్తుంది.
వంట పాత్రలు
సాధారణంగా వంట గదిని సౌభాగ్యానికి సూచిక అంటారు. ఈ సౌభాగ్యాన్ని రెట్టింపు చేసే పాత్రలను కిచెన్‌లో ఉపయోగించాలి. రాగి, వెండి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి వంటపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయట. దీంతో పాటు ఆరోగ్య పరంగానూ మేలు చేకూరుస్తాయి.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?