చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. స్వదేశంలో ఫ్లాగ్షిప్ ప్రీమియం 5జీ మెుబైల్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ 12 (Oneplus 12) పేరుతో ఈ మెుబైల్‌ను తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఫోన్ భారత్‌లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ నయా ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ స్క్రీన్
ఈ వన్‌ప్లస్ 12 మెుబైల్.. 6.7 అంగుళాల QHD+ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 Soc ప్రొసెసర్‌పై ఇది పని చేస్తుంది. ఈ ప్రొసెసర్‌తో వచ్చిన తొలి ప్రీమియం ఫోన్ ఇదే కావడం విశేషం. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ OSను ఫోన్‌కు అందించారు.
ర్యామ్ & స్టోరేజ్
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ చైనాలో నాలుగు వేరియంట్లలో విడుదలైంది. 12GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB , 24GB + 1TB ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇదే స్టోరేజ్ ఆప్షన్లతో భారత్‌లో ఈ ఫోన్ అడుగు పెట్టే అవకాశముంది.
కెమెరా క్వాలిటీ
ఈ వన్‌ప్లస్ మెుబైల్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా విత్ Sony LYT-808 సెన్సార్ + 64 MP టెలిఫొటో కెమెరా + 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఫోన్‌కు అందించారు. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరాను ఫిక్స్ చేశారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
పవర్ఫుల్ బ్యాటరీ
ఈ మెుబైల్‌కు శక్తివంతమైన బ్యాటరీని అందించారు. 5400mAh బ్యాటరీని ఫోన్‌కు అమర్చారు. ఇది ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సహకరిస్తుంది. వీటి ద్వారా ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ మెుబైల్.. 5జీ, 4జీ LTE, వై-ఫై, బ్లూటూత్ V5.3, NFC, GPS, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే IP65 rating వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫిక్స్ చేశారు.
కలర్ ఆప్షన్స్
ఈ వన్‌ప్లస్ 12 మెుబైల్ చైనాలో మూడు కలర్ ఆప్షన్స్‌లో రిలీజయ్యాయి. పైల్ గ్రీన్, రాక్ బ్లాక్, వైట్ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇవే కలర్స్‌తో ఈ ఫోన్ భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది.
ధర ఎంతంటే?
వన్‌ప్లస్ 12 మెుబైల్ ధర భారత్‌లో ఎంత ఉంటుందన్న దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మెుబైల్ వేరియంట్‌ను బట్టి ధర ఉండవచ్చు. చైనాలో నిర్ణయించిన ధరలను బట్టి భారత్‌లో 12GB + 256GB వేరియంట్ ధర రూ.50,700 ఉండవచ్చని అంచనా. అలాగే 12GB + 256GB రూ.56,600, 16GB + 1TB రూ.62,500, 24GB + 1TB వేరియంట్ ధర రూ.68,400 ఉండే అవకాశముంది. ధరలపై త్వరలోనే స్పష్టత రానుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం