• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?

    నటీనటులు : విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని, రామచంద్రరాజు, యోగి బాబు, మురళిశర్మ, హరీష్‌ పెరడి, మోహన్‌ రమన్‌, విజయ్‌ కుమార్‌ తదితరులు

    కథ, దర్శకత్వం: హరి

    సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌

    సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్‌

    ఎడిటింగ్‌ : టీ.ఎస్‌. జై

    నిర్మాత : కార్తికేయన్‌ సంతానం, అలంకార్‌ పాండియన్‌

    విడుదల తేదీ: 26 ఏప్రిల్‌, 2024

    యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో రూపొందిన హ్యాట్రిక్‌ చిత్రం ‘రత్నం’ (Rathnam Movie Review In Telugu). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి ‘భరణి’, ‘పూజా’ ఘన విజయాలను సాధించాయి. దీంతో మూడోసారి ఈ హిట్‌ కాంబో రిపీట్‌ కావడంతో ‘రత్నం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించింది. సముద్రఖని, యోగి బాబు, మురళిశర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశాల్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? రత్నం సినిమా అంచనాలు అందుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి?

    రత్నం (విశాల్‌).. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో జీవిస్తుంటాడు. జననీ (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? చివరికీ ఏమైంది? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    హీరో విశాల్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నటనతో అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా భవానీ శంకర్‌ మెప్పించింది. విశాల్‌తో వచ్చే ఏమోషనల్‌ సీన్స్‌లో ఈ అమ్మడు పోటీపడి మరి నటించింది. కామెడియన్ యోగిబాబు మరోమారు తన మార్క్‌ కామెడీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. గౌతమ్‌ మీనన్‌, సముద్రఖని, మురళి శర్మ తమ పాత్రల్లో జీవించేశారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    డైరెక్టర్‌ హరి.. ఎప్పటిలాగే ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేశారు. అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఇచ్చారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్, ప్రియా భవానీ శంకర్ మధ్య వచ్చే ఏమోషన్ సన్నివేశాలను చక్కగా ప్రెజెంట్‌ చేశారు. అయితే వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ కంటే సినిమాటిక్‌ టోన్‌ ఎక్కువగా ఉంది. యోగిబాబు కామెడీ సీన్లు తమిళ నేటివిటితో ఉండటం.. తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. ఇక డైరెక్టర్‌ హరి గత చిత్రాలతో పోలిస్తే స్క్రీన్‌ప్లే కూడా చాలా పూర్‌గా ఉంది. అయితే విశాల్‌ అభిమానులు, మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చాలా ఎలిమెంట్స్‌ సినిమాలో ఉండటం మూవీకి ప్లస్‌.

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు, సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఎమోషనల్‌, యాక్షన్‌ సీక్వెన్‌లో దేవి ఇచ్చిన BGM.. ఆ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. అటు ఎం. సుకుమార్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంది. టీ.ఎస్‌ జై ఎడిటింగ్‌ వర్క్స్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • విశాల్‌ నటన
    • యాక్షన్ సీక్వెన్స్‌
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • కథలో కంటెంట్‌ లేకపోవడం
    • ఆసక్తి పెంచని స్క్రీన్‌ ప్లే

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv