రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణం’ (Ramayanam) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలోనే సెట్ నుంచి కొన్ని ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
రణ్‌బీర్, సాయిపల్లవి లుక్స్ లీక్
తాజాగా రామాయణం సెట్ నుంచి రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోలు లీకయ్యాయి. ఇందులో రణ్‌బీర్ రాముడి గెటప్‌లో కనిపించాడు. సీత కాస్ట్యూమ్‌లో సాయిపల్లవి అందంగా కనిపించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ముఖ్యంగా సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కట్టు, బొట్టు, హుందాతనం చూస్తే అచ్చం సీతలాగే ఉందని ప్రశంసిస్తున్నారు. సీత పాత్రకు ఆమె ఎంపిక 100 శాతం సరైనదని అంటున్నారు. అటు రాముడిగా రణ్‌బీర్ లుక్ కూడా బాగుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అతడి ఆహార్యం రాముడి సరిగ్గా సరిపోయిందని పేర్కొంటున్నారు. సీతారాములుగా వీరి పెయిర్ చూడ ముచ్చటగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇద్దరు ఆస్కార్ విన్నర్లు!
రామాయణం చిత్రానికి సంగీతం అందించడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రాబోతున్నారట. ఇందులో ఒకరు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ కాగా.. ఇంకొకరు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్దరూ కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై నితీష్ తీవారి ఏ.ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్సెప్షన్’ చిత్రాలతో హన్స్ జిమ్మెర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.
త్రివిక్రమ్‌కు కీలక బాధ్యత!
రామాయణ తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)కు మేకర్స్ అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వస్తుందని అంటున్నారు.
గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణం’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!