• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bachhala Malli Review: మూర్ఖుడిగా అల్లరి నరేష్‌ సూపర్బ్‌.. ‘బచ్చలమల్లి’తో హిట్‌ కొట్టాడా?

    నటీనటులు: అల్లరి నరేష్‌, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు

    కథ, దర్శకత్వం: సుబ్బు మంగదేవి

    సంగీతం: విశాల్ చంద్రశేఖర్‌

    సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్‌.నాథన్‌

    ఎడిటింగ్‌: ఛోటా కె ప్రసాద్

    నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా 

    నిర్మాణ సంస్థ‌: హాస్య మూవీస్

    విడుదల తేదీ: డిసెంబర్‌ 20, 2024

    అల్లరి నరేష్‌ (Allari Naresh) మాస్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా డిసెంబర్‌ 20న (Bachhala Malli Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నరేష్‌ నటన బాగుందా? అతడి ఖాతాలో మరో విజయం పడిందా? ఇప్పుడు తెలుసుకుందాం.

    కథేంటి

    కథ 1995 – 2005 మధ్య (Bachhala Malli Review) తుని, సూరవరం ప్రాంతంలో సాగుతుంటుంది. బచ్చలమల్లి (అల్లరి నరేశ్‌) చిన్నప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి తండ్రి గర్వపడేలా చేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం మల్లిని ఎంతగానో బాధిస్తుంది. దాంతో చదువుకు స్వస్థి పలికి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ట్రాక్టర్‌ నడుపుతూ మూర్ఖుడిగా మారిపోతాడు. మద్యం తాగుతూ ఊరిలో ఏదోక గొడవలో తలదూరుస్తూ బేవర్స్‌గా మారిపోతాడు. అప్పుడే అతడి లైఫ్‌లోకి కావేరి (అమృత అయ్యర్‌) వస్తుంది. ఆమె రాకతో మల్లీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇంతకీ ఏంటా మార్పులు? కావేరితో అతడి ప్రేమ కథ ఎలా మెుదలైంది? చివరికీ సుఖాంతం అయ్యిందా? లేదా? అసలు తండ్రితో మల్లికి ఉన్న సమస్య ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    బచ్చల మల్లి పాత్రలో అల్లరి నరేష్‌ (Bachhala Malli Review) పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. గమ్యం సినిమాలో చేసిన గాలి శీను పాత్ర తరహాలో బచ్చలమల్లి రోల్‌ కూడా అతడి కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మూడు వేరియేషన్స్‌ కలగలిసిన ఆ పాత్రలో నరేష్‌ అదరగొట్టాడు. హావ భావాలు చక్కగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో పరిణితి చూపించాడు. హీరోయిన్‌ కావేరి పాత్రలో అమృత అయ్యర్ (Amritha Aiyer) బాగా చేసింది. అమాయకంగా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. రావు రమేశ్ (Rao Ramesh) పాత్ర సినిమాకి కీలకం. అల్లరి నరేష్‌తో వచ్చే సీన్స్‌లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రావు రమేష్‌ నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాదాసీదాగా కనిపిస్తూనే విలనిజం బాగా పండించాడు. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు బలమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు సుబ్బు మంగదేవి కంచెలు తెంచుకున్న మూర్ఖుడి కథగా ‘బచ్చలమల్లి‘ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచే హీరో పాత్రను ఎస్టాబ్లిష్‌ చేసిన విధానం బాగుంది. చాలా రఫ్‌గా ఉండే హీరో ప్రేమలో పడిన విధానం, ప్రేయసి రాకతో అతడి లైఫ్‌లో వచ్చిన మార్పులు చక్కగా చూపించాడు. తన మూర్ఖత్వంతో ఏమేమి తప్పులు చేశానో హీరో రియలైజ్‌ అయ్యే సీన్స్‌ మెప్పిస్తాయి. బంధాలు తెంచుకోవడం చాలా తేలిక.. నిలుపుకోవడంలోనే మన గొప్పతనం దాగుందన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అయితే స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సీన్స్‌కు లాజిక్స్‌ ఉండవు. హీరో పాత్రను ప్రభావితం చేసే సన్నివేశాలు చాలా పేవలంగా అనిపిస్తాయి. మూడు పార్శ్వాలుగా కథ చెప్పడం కాస్త గందరగోళానికి గురిచేసింది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ టచ్‌ మాత్రం హృదయాలకు హత్తుకుంటుంది. 

    సాంకేతికంగా..

    టెక్నికల్‌ విషయాలకు వస్తే (Bachhala Malli Review) సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటల్లో ‘మా ఊరి జాతర్లో’ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ కెమెరా పనితనం గ్రామీణ నేపథ్యాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • నరేష్‌ నటన
    • కథా నేపథ్యం
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • ఆసక్తిలేని కథనం
    • లాజిక్స్‌కు అందని సీన్స్‌
    • అక్కడక్కడ పండని ఎమోషన్స్‌
    Telugu.yousay.tv Rating : 2.5/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv