ఆధునిక ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ నాయకుడిగా కూడా ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని ఘనతలను అందుకున్నాడు. ఇక నిన్న తాను టీ-20 కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఏదో ఒక దశలో కోహ్లీ కెప్టెన్సీను వీడి పోవాల్సిందే కానీ అత్యంత నాటకీయంగా తను ఈ బాధ్యతలను తప్పుకోవడం అనేది ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. అదే సమయంలో కోహ్లీ కెప్టెన్సీని వదిలేయడం వెనుక పెద్ద తతంగమే జరిగిందని కొన్ని క్రీడా వార్తా సమాచార మాధ్యమాల నుండి రిపోర్టులు వచ్చాయి. వాటన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే…
సరిగ్గా నాలుగు రోజుల క్రితం విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీ నుండి తప్పుకోనున్నాడు అన్న వార్త ఒకటి లీక్ అయింది. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక రోజంతా హడావుడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని న్యూస్ వెబ్ సైట్లలో దీనిని ప్రచురించారు. ఈ లోపల బీసీసీఐ నాటకీయంగా ఒకరిని పంపించి అలాంటిదేమీ లేదని చెప్పడం జరిగింది.
ఎన్నో కారణాలు?
కట్ చేస్తే… కోహ్లీ అనూహ్యంగా తను టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే కోహ్లీని కెప్టెన్సీ నుండి తప్పించాలని ముందే బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఓడిపోవడం, ఇంగ్లండులో అశ్విన్‌ను పక్కన పెట్టడం, కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోవడం, సెలక్టర్లతో విబేధాలు ఇతరత్రా కారణాల వల్ల కోహ్లీ కెప్టెన్సీపై వేటు పడే పరిస్థితి వచ్చిందని… ఇక అప్పుడు కోహ్లీ మాత్రం తనకి తానే తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.
అసలు ఈ విషయం తెలుసా?
అదీ కాకుండా కోహ్లీ ఈ సంచలన ప్రకటన చేసి కొద్ది గంటలు గడవకముందే బీసీసీఐ ప్రతినిధి నుండి ఒక లీక్ వచ్చినట్లు కొన్ని వెబ్ సైట్లు చెప్పాయి. అదేంటంటే… ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటించినప్పుడు వన్డే జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో సెలెక్టర్లతో ఓపెనర్ గా శిఖర్ ధావన్ ను కాదని ఒక యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్న సమయంలో కోహ్లీ మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇక ఎన్నో వాదోపవాదాలు తర్వాత చివరకు కోహ్లీ మాటే నెగ్గింది.
ధావన్‌కు అలా… కోహ్లీకి ఇలా
అయితే ఐపీఎల్లో వరుస సెంచరీలు చేసి, ఆరెంజ్ క్యాప్ సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ మాత్రం టీ-20 ప్రపంచకప్ జట్టులో లేడు. ఇక కోహ్లీ టీ20 కెప్టెన్‌గా పొట్టి ప్రపంచకప్ తర్వాత తప్పుకోనున్నాడు. వీటన్నింటిని బట్టి చూస్తే పైన ఉన్న కారణాలు విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి అనడంలో సందేహం లేదు అని అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రస్తుత క్రికెట్ గ్లోబల్ సూపర్ స్టార్ అయినా వ్యక్తి ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి ఉంటాడా… అంటే దానికీ మన వద్ద సమాధానం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కోహ్లీ టీ-20 కెప్టెన్ గా తప్పుకున్నప్పటికీ భారతదేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా మిగిలిపోతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి