మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు. కొణిదెల ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. చిరంజీవి, చరణ్ తెరపై ఒకేసారి కనిపిస్తున్నారంటే మెగా ఫ్యాన్స్‌కు పండగే. వాళ్లు చేసిన ప్రమోషన్స్ ద్వారా అంచనాలను మరింత పెంచారు. లాహే లాహే, బంజారా సాంగ్ తెరపై చూడాలన్న ఉత్సాహాన్ని పెంచాయి. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉందా? కథేంటి ? తెలుసుకుందాం.
కథేంటంటే..
ధర్మస్థలి అనే ఆలయ ప్రాంతం బసవ (సోనూసూద్) నిరంకుశ పాలనలో ఉంటుంది. దాని నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ఆచార్య(చిరంజీవి) వస్తాడు. ఆచార్య బసవలో భయాన్ని ఎలా సృష్టిస్తాడు? సిద్ధ (రామ్ చరణ్)తో అతడికి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా కథ.
విశ్లేషణ
మెగాస్టార్‌కు ఒక ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. పూర్తిగా కొరటాల శివ హీరోగా మారిపోయాడు. ఒక స్థిరమైన పాత్రలో సైలెంట్ హీరోగా కనిపిస్తాడు. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రమే ఎనర్జీ కనపడుతుంది. కొరటాల శివ రాసిన కథలో కూడా కొత్తదనం ఏమీ లేదు. ప్రారంభం నుంచి అంతా ఊహించినట్లుగానే సాగుతుంటుంది. మెగాస్టార్ తెరపై కనిపిస్తున్నప్పటికీ ప్రేక్షకులకు సినిమా బోర్ కొట్టడమంటే దర్శకుడు అక్కడే విఫలమైనట్లు చెప్పుకోవాలి.
చరణ్, చిరంజీవి కలిసి నటించినప్పుడు ఒక మంచి కథ అయితే అది ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేది. ఇద్దరినీ ఒకసారి మంచి సినిమాలో చూడాలనుకున్న అభిమాలను ఆశలు నిరాశలయ్యాయి. మెగాస్టార్‌ను, చరణ్‌ను కూడా దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. రామ్ చరణ్ రెండో భాగంలో కనిపిస్తాడు. నటన బాగానే ఉన్నప్పటికీ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్‌లో లేదనిపిస్తుంది.
కొరటాల శివ సినిమా అంటే ఒక సోషల్ మెసేజ్‌తో కూడిన కథను కమర్షియల్‌గా తెరకెక్కించడంలో దిట్ట అనే అభిప్రాయం ఉంది. కానీ ఈ సినిమాలో దాన్ని బ్రేక్ చేశాడు. ఈ సినిమా దర్శకుడు ముందు సినిమాలను గుర్తు చేస్తుంటుంది. ప్రత్యేకంగా చెప్పుకోదగిన కొత్త ఎలిమెంట్ ఏమీ ఉండదు.
చిరంజీవి, రామ్‌చరణ్‌లు తప్ప ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇతర పాత్రలకు సరైన న్యాయం చేయకుండానే మధ్యలో వదిలేశాడనే అభిప్రాయం కలుగుతుంది. పూజా హెగ్డే సిద్ధను ఇష్టపడే నీలాంబరి పాత్రలో కనిపించింది. అది కూడా ఆమెకు పెద్దగా కలిసొచ్చే క్యారెక్టర్ ఏమీ కాదు. ప్రతి నాయుకుడి పాత్రలో సోనూసూద్ తన పాత్ర మేరకు నటించాడు. నాజర్, వెన్నెల కిషోర్ వంటి ఇతర పాత్రలు వృథా అయిపోయాయి.
సాంకేతిక విషయాలు:
మణిశర్మ అందించిన పాటలు కొంతమేరకు పర్వాలేదనిపించాయి. ఇప్పటికే విడుదలైన లాహే లాహే, బంజారా పాటలు బాగున్నాయి. ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నిరాశపరిచింది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే తిరు కెమెరా పనితనం చాలా బాగుంది. ధర్మస్థలి, అడవిని చక్కగా చూపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.
బలాలు
- మెగాస్టార్-చరణ్ మధ్య సన్నివేశాలు
- బంజారా సాంగ్
బలహీనతలు
- పాత కథ
- ఎమోషన్స్ పండకపోవడం
- కథనం
- సాగదీత సన్నివేశాలు
రేటింగ్ 2/5
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి