ముంబయి, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకరు SRH బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్. కీలకమైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన అతడు.. జట్టును గెలిపించాలనే కసిగా ఆడినట్లు ఏ మాత్రం కనిపించలేదు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు సమద్‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరొకరు క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్. అతడు వేగంగా బంతులు విసరడం లేదనే కామెంట్లు వస్తున్నాయి.
గల్లీ క్రికెట్ ఆడుకో
రోహిత్ సేన విధించిన టార్గెట్‌ను SRH బ్యాటర్లు ఒకానొక దశలో చేధించేలా కనిపించారు. కానీ, కీలకమైన సమయంలో క్లాసెన్, మయాంక్ అగర్వాల్ ఔట్ కావటంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు అబ్దుల్ సమద్. బ్యాటింగ్‌లో ఏ మాత్రం ప్రదర్శన కనబర్చలేదు. బౌండరీలు కొట్టాల్సిన సమయంలో డాట్ బాల్స్, సింగిల్స్ తీయడం.. ఉప్పల్‌లో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కోపం తెప్పించాయి. 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలోనూ ఏ మాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో ఫ్యాన్స్ అతడిని దారుణంగా విమర్శిస్తున్నారు. ‘నీకో దండం ఇంకోసారి బ్యాట్ పట్టకు, గల్లీ క్రికెట్ ఆడుకో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇంకెందుకు భరిస్తున్నారో?
జమ్ము కశ్మీర్‌కు చెందిన సమద్ 2020లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి దాదాపు మూడేళ్లపాటు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ అతడికి అవకాశాలు కల్పిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కసారి కూడా సరైన ప్రదర్శన చేయలేదు. అయినా ఇప్పటికీ ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. కీలకమైన సమయాల్లో కూడా రాణించకపోతే అతడిని ఇంకా ఎందుకు భరిస్తున్నారో అర్థం కావడం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రషీద్ ఖాన్‌ను కాదని
ఐపీఎల్ 2022లో అబ్దుల్ సమద్‌ను SRH రిటైన్ చేసుకుంది. అప్పటివరకు కీలకమైన బౌలర్‌గా ఉన్న రషీద్, వార్నర్‌ను వదులుకున్న ఫ్రాంఛైజీ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, సమాద్ను మాత్రమే రిటైన్ చేసుకుంది. అంతలా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ సమద్ రాణించకపోవటం అటు యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్‌కి కూడా కోపం తెప్పించడంలో తప్పులేదు.
భవిష్యత్ కష్టమే
ఐపీఎల్లో సమద్ 28 మ్యాచులు ఆడాడు. ఇందులో 23 ఇన్నింగ్స్‌లలో కేవలం 288 పరుగులు మాత్రమే చేశాడు. అతడి హైస్కోర్ కేవలం 33 రన్స్. స్ట్రైక్ రేట్ 135.21గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే ఈ జమ్ము కశ్మీర్ ప్లేయర్ ఏ మాత్రం ఆసక్తిగా ఆడటం లేదని అర్థమవుతుంది. నాలుగేళ్లుగా అతడు ఫామ్‌లో లేడు. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. మరోవైపు ప్రస్తుతం చాలాజట్లలో ఆడుతున్న యంగ్ క్రికెటర్స్ చెలరేగుతున్నారు.ఈ క్రమంలో సమద్‌కు ఇక అవకాశాలు కష్టంగా మారతాయి. అతడు నిరూపించుకోకపోతే కనుమరుగవ్వాల్సిందే.
అర్జున్.. స్పిన్ వేస్తే బెటర్
ఇదే మ్యాచ్‌లో ముంబయికి చెందిన ఆటగాడు, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ట్రోల్స్‌కు గురయ్యాడు. అదేంటీ? బౌలింగ్ బాగానే చేసి జట్టును గెలిపించాడు కదా అనుకుంటున్నారా? నిజమే కానీ, అర్జున్ వేగంగా బంతులు విసరలేకపోతున్నాడు. కనీసం మీడియం పేస్ కూడా పడట్లేదు. 100kmph కూడా దాటడం లేదని కామెంట్లు వస్తున్నాయి. దీని బదులు స్పిన్ వేసుకుంటే బెటర్ అంటూ సలహాలు ఇచ్చే వారు కూడా లేకపోలేదు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!