• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Actress Samantha: సర్‌ప్రైజ్‌ చేసిన సమంత… అసలు విషయం ఏమిటంటే?

    టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) క్రేజీ ఔట్‌ ఫిట్స్‌తో హల్‌చల్‌ చేసింది. ఎంతో గ్లామర్‌గా డిజైన్‌ చేసిన పొట్టి బట్టలు ధరించి విపరీతంగా క్లీవేజ్‌ షో చేసింది.

    సమంత తాజా బోల్డ్‌ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. ఆమె అందాలను పొగుడుతూ ఫ్యాన్స్‌ విపరీతంగా కామెంట్స్‌ పెడుతున్నారు. 

    ఓ కంపెనీకి సంబంధించి బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత  ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్‌ ఇలా గ్లామర్‌ షోలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

    గతేడాది ఖుషి (Kushi Movie 2023)తో అలరించిన సమంత (Samantha) త్వరలో సిటాడెల్‌ (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు.

    బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్ (Varun Dhawan) సిటాడెల్‌ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్నారు. 

    మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది.  ‘ట్రా లా లా మూవీంగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 

    కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ (Samantha Ruth Prabhu) తెలిపింది.

    ఇదిలా ఉంటే తాజాగా సామ్‌ గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ చిత్రంలోనూ ఆమె ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఈ రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ‘పుష్ప’ పార్ట్‌-1లో సామ్ చేసిన ఐటెమ్‌ సాంగ్‌ అప్పట్లో ఉర్రూతలూగించింది.

    ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది. 

    బాలీవుడ్ భామ ఆలియా భట్‌ మెుదటి ప్లేస్‌ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్‌, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం.

    ప్రస్తుతం సామ్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv