• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Allu Arjun: ‘పుష్ప 3’పై బన్నీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!

  తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్‌ను ఫుల్‌ జోష్‌లో నింపాయి. 

  ‘పుష్ప 3’ కూడా ఉంటుందట!

  జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అక్కడ పుష్ప సినిమా గురించి కొత్త అప్‌డేట్‌ను అందించారు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని బన్నీ తెలిపారు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ ‘పుష్ప 2’లో పాత్రలు వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌అనిపిస్తాయని చెప్పారు. ఈ సినిమా తర్వాత చాలా ఆసక్తికర ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయని బన్నీ తన ప్రసంగాన్ని ముగించారు. 

  ‘పుష్ప ముగింపు లేని కథ’

  నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న పుష్ప చిత్రంలో హీరోయిన్‌గా నటించి అద్భుత నటన కనబరిచింది. తనదైన యాస, భాషతో శ్రీవల్లి పాత్రలో జీవించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘పుష్ప 2’ చిత్రంపై స్పందించింది. పుష్ప 2 అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ‘ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా చేయాలనే తపన మాలో ఉంది. పుష్ప ముగింపు లేని కథ, ఎలా అయినా దీనిని రూపొందించవచ్చు’ అని అన్నారు. రష్మిక వ్యాఖ్యలను బట్టి చూసిన కూడా పార్ట్‌ 3పై సానుకూల సంకేతాలే వచ్చాయి.

  బన్నీ ప్లాన్స్‌ తలకిందులు!

  నిజానికి పుష్ప సినిమాను ఒక్క పార్ట్‌లోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) భావించారు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. దీనికి బన్నీ కూడా ఓకే చెప్పడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ ప్లానింగ్స్ అన్ని తలకిందులు అయ్యాయి. పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ అనౌన్స్ చేశాడు. కానీ పుష్ప 2 సడెన్‌గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు పుష్ప 3 సెట్స్‌పైకి వెళ్తే బన్నీ మరో ఏడాది కూడా సుకుమార్‌కే అంకితం కావాల్సి ఉంటుంది. 

  బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌

  ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv