• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏక్తాకు జాబ్ ఆఫర్ చేసిన ట్రూ కాలర్

    నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న యువతికి ట్రూ కాలర్ సీఈవో బాసటగా నిలిచారు. కెనడాలో ఉంటున్న ఏక్తాను ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అని ఓ యూట్యూబర్ ప్రశ్నించారు. దీంతో ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ ఏక్తా బదులివ్వడం దుమారం రేపింది. దేశాన్ని వదిలేయడం డ్రీమా అంటూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో విమర్శలు పట్టించుకోవద్దని సీఈవో ఏక్తాకు సూచించారు. చదువు పూర్తయ్యాక ట్రూ కాలర్‌‌లో చేరొచ్చని జాబ్‌ ఆఫర్‌ చేశారు. Sad that we don’t get to see sunrise … Read more

    ఆందోళనాకారుల ఇళ్లపై బుల్డోజర్ ప్రయోగం

    హరియాణాలో అల్లర్లకు కారణమైన వారి ఇళ్లపై ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది. ఈ క్రమంలో నూహ్ జల్లాలో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించింది. వారు అక్రమ వలసలు వచ్చి ఇక్కడ మకాం వేసి అల్లర్లకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో వీరు పాల్గొని రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్న సీసీటీవీ దృశ్వాలను పోలీసులు సేకరించారు. ఈ మేరకు దాడులు చేస్తున్న ఫోటోలను విడుదల చేశారు. UP model in Haryana ?? This is Bulldozer 'justice' Houses of 250 … Read more

    చాహల్ బ్యాటింగ్‌లో అయోమయం.. వీడియో వైరల్

    వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం నెట్టింట వైరల్‌గా మారింది. కుల్‌దీప్‌ యాదవ్‌ ఔటై పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో ముందు చాహల్‌ మైదానంలోకి అడుగు పెట్టాడు. అయితే కెప్టెన్, ముకేశ్‌ కుమార్‌ను పంపించాలని భావించాడు. ఈ విషయాన్ని ఉమ్రాన్‌ మాలిక్‌ ద్వారా చాహల్‌కు తెలిపాడు. ఆ వెంటనే చాహల్ తిరిగి డగౌట్‌ వైపు వస్తుండగా అంపైర్లు అతడిని పిలిచారు. మైదానంలోకి వచ్చాక అలా వెళ్లడం రూల్స్‌కు విరుద్దమని … Read more

    ‘సైలెంట్‌గా ఉండకపోతే మీ ఇంటికి ‘ఈడీ’ వస్తుంది’

    లోక్‌సభలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ సైలెంట్‌గా ఉండక పోతే తమ ఇంటికి ఈడీ వస్తుందని హెచ్చరించారు. అనంతరం బిల్లుపై మాట్లాడుతూ కేజ్రీవాల్ పావు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పకనే చెప్పారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. This insinuating threat given by @M_Lekhi in the heat of the … Read more

    మత ఘర్షణల్లో ఏడుగురు మృతి

    హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విశ్యహిందూ పరిషత్ మతపరమైన ఉరేగింపును మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనాకారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. ఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఇప్పటి వరకు 116 మంది ఆందోళనాకారులను అరెస్ట్ చేశారు. Stone pelting can be seen from rooftops in Nuh, Mewat of Haryana. pic.twitter.com/I0fPIlXkIy — Aditya Raj Kaul (@AdityaRajKaul) July … Read more

    పాఠాలు చెబుతున్న రోబో టీచర్

    బెంగళూరులో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, రోబో టీచర్‌ను పరిచయం చేసింది. ఈ రోబో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులను బోధిస్తుంది. ఇలా పాఠాలు చెబుతున్నఈ రోబో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రోబో పాఠాలతో పాటు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన రోబో టీచర్ ప్రపంచంలో మొట్టమొదటిది కావడం విశేషం. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet … Read more

    మ్యాచ్ మధ్యలో పాము..బెదిరిపోయిన క్రికెటర్లు

    శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. దంబుల్లా ఆరా, గాలే టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి పాము ప్రవేశించింది. దాన్ని చూసిన ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంపైర్ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు పామును పట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో 10 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hello, stranger. Where is your accreditation card? ? Even the Sri Lankan wildlife can't … Read more

    ‘ట్విటర్‌ పేరు మార్పు నా చావుకొచ్చింది’

    ట్విట్టర్ పేరు మార్పు తన చావుకొచ్చిందంటూ ఓ యూజర్ ఆవేదన వెళ్లగక్కాడు. కాలిఫోర్నియాలో ట్విట్టర్ హెడ్ క్యార్టర్స్ ఎదురుగా క్రిస్టోఫర్ నివాసముంటున్నాడు. క్వార్టర్స్‌పై అమర్చిన X గుర్తు రేడియంట్ లైట్ వెలుగుతూ తన ఇంటిపై పడుతుండటంతో నిద్రపట్టడంలేదని క్రిస్టోఫర్ చెప్పుకొచ్చాడు. తన బెడ్‌రూమ్‌పై పడుతున్న X గుర్తు వెలుతురును పోస్ట్ చేస్తూ ఇది నా పరిస్థితి అంటూ ఆవేదనను వెళ్లగక్కాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. Imagine no more. This is my life now. https://t.co/k5QfAm8yuG pic.twitter.com/e7ECCM2NUD — … Read more

    నవ్వులు పూయిస్తున్న క్రికెట్‌ వీడియో

    యూరోపియన్ క్రికెట్‌ లీగ్ మ్యాచ్‌లో ఓ వికెట్ కీపర్ చేసిన పని అందరి చేత నవ్వులు పూయించింది. యునైటెడ్ క్రికెట్ క్లబ్, ప్రాగ్యూ టైగర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. యునైటెడ్ జట్టుకు చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమైంది. ఈ క్రమంలో ప్రాగ్యూ జట్టు వికెట్ కీపర్ రనౌట్‌ చేసేందుకు బంతిని కాలితో వికెట్ల మీదకు తన్నాడు. అది స్టంప్స్‌ను తాకకుండా దూరంగా వెళ్లిపోయింది. అక్కడి నుంచి ఫీల్డర్లు వేగంగా బంతిని విసిరేయడంతో అది కాస్త బౌండరీ లైన్‌ దాటేసింది. దీంతో యునైటెడ్ … Read more

    వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము

    ఓ చెట్టు కింద పడుకున్న వ్యక్తి చొక్కాలోకి పాము ప్రవేశించింది. దీంతో ‌అతడు భయంతో వణికిపోయాడు. కదలకుండా బొమ్మలా కూర్చొని ఉండిపోయాడు. అదృష్టం కొద్ది ఆ వ్యక్తిని పాము కాటు వేయలేదు. కొంత సేపటి తర్వాత చొక్కా నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాము బయటకు ఆ వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న విషయంపై క్లారిటీ లేదు. खेत में काम करते-करते थोडा विश्राम करते हो तो साफ सुथरी जगह … Read more