• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంచెత్తిన మంచు

    జమ్ము కశ్మీర్‌లో మరోసారి హిమపాతం [అలజడి](url) సృష్టించింది. ప్రముఖ హిల్ స్టేషన్ సోనా మార్గ్‌లో అవలాంచ్ ఏర్పడింది. ఓ నిర్మాణ సంస్థ అక్కడ సొరంగ మార్గం నిర్మిస్తోంది. ఆ ఉద్యోగులు అక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. మంచు ఉప్పెన రావటంతో ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. వారికి ఏం కాలేదని సురక్షితంగా ఉన్నారని సంస్థ యాజమాన్యం తెలిపింది. నాలుగు దిక్కుల నుంచి వస్తున్నట్లు కనిపించే దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. Breaking – Another Big Avalanche hits #Sarbal As per … Read more

    లాగిపెట్టి ఒక్కటి పీకిన పోలీస్‌

    [VIDEO:](url)ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఎన్ని చూసిన కొందరు నిర్లక్ష్య ధోరణి వీడరు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటకూడదని… అప్రమత్తంగా ఉండాలని చెప్పినా పెడచివిన పెట్టేవారే ఎక్కువ. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఓ వ్యక్తి రైలు వస్తున్నా పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అతడిని రైల్వే పోలీసు లాగి ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలో ఒక్కటి లాగిపెట్టి పీకాడు. అలాంటి వాళ్లకు కొట్టి బుద్ధి చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Sometimes you deserve help … Read more

    నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్న: అనసూయ

    యాంకర్, నటి అనసూయ తనపై నెగటివ్ కామెంట్లు చేసేవారికి పరోక్షంగా గట్టి [కౌంటర్](url) ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.” నా గురించి నెగటివ్‌గా మాట్లాడే వారిని అస్సలు లెక్క చేయను. వారి గురించి పట్టించుకోకపోవడమే నాకున్న డిజార్డర్‌” అనే రీల్‌ నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే చాలా విషయాల్లో అనసూయను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. వాటిపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే మరోసారి పోస్ట్ పెట్టింది రంగమ్మత్త. View this post on … Read more

    కర్ణాటకలో మెగాస్టార్ చరిశ్మా

    మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ [సందడి ](url)చేస్తోంది. అక్కడ చిరు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 150 ఆటోలతో ప్రదర్శన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఎక్కడైనా మెగాస్టార్‌ చరిశ్మా తగ్గదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చిరంజీవి ఖాతాలో మరో హిట్‌ పడిందని టాక్. BOSS of MASSES @KChiruTweets ???? A 154 … Read more

    ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య

    [VIDEO:](url) బాలయ్య వీరసింహా రెడ్డి విడుదలైన థియేటర్లలో అభిమానులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ వద్ద దీపావళిని మించి టపాసులు కాల్చారు. డప్పు, దరువులతో కోలాహలం నెలకొంది.ఈ థియేటర్‌కి నటసింహం బాలకృష్ణతో పాటు దర్శకుడు గోపిచంద్‌ మలినేని వచ్చారు. అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూశారు. వీరసింహా రెడ్డి అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరు 30 లక్షలు, వరంగల్‌ 17.58 లక్షలు బుక్‌ అయినట్లు తెలుస్తోంది. https://twitter.com/i/status/1613434441556439041

    ఇదేం టాలెంట్ భయ్యా.. ఇరగదీసింది !

    టాలెంట్‌కు అడ్డుకట్ట వేయడం ఎవరివల్ల కాదు. ఈ విషయం నిత్యం ఏదో ఒక రూపంలో మనకు తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఓ అమ్మాయి చేసిన స్టంట్‌ చూస్తే అబ్బురపడాల్సిందే. తన కాలి వేళ్లతో ఆమె బాణం విసిరిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అయ్యింది. అంతేకాదు, ఈ సమయంలో ఆమె స్టాండ్‌పైనా చేతులతో నిల్చోవడం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. బాణానికి నిప్పు కూడా అంటించింది. ఒరిస్సా కెల్లి తనని తాను ఇంటర్నేషనల్‌ ఫూట్‌ ఆర్చర్‌ అని ఇన్‌స్టాలో చెప్పుకుంది. View this … Read more

    హోర్డింగ్‌కు ఉరి వేసుకొనేందుకు యత్నం

    సిద్దిపేట జిల్లా ముస్తాబాద్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి [హల్‌చల్‌](url) చేశాడు. డివైడర్‌ మధ్య ఉన్న హోర్డింగ్‌కి ఉరేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకొని అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. ఓ పాఠశాల బస్సును అతడి కింద నిలిపారు. మెడకు తాడుతోనే కిందకు దూకగా వాహనం ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన జి.కొమురయ్య అలియాస్‌ కుమార్‌గా గుర్తించారు. గతంలోనూ ఇలాగే చేశాడట. This is the Situation in #Siddipet Mr.@trsharish Do you have an Answer?@BRSparty … Read more

    మెట్రోలో యువతి ఏం చేసిందంటే?

    సామాజిక మాధ్యమాల్లో త్వరగా గుర్తింపు తెచ్చుకోవటానికి కొందరు చేయని ప్రయత్నం ఉండదు. ఇటీవల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. దిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ యువతి చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎవ్వరూ లేని బోగిలో ఎక్కిన ఆమె హ్యాండ్‌ రెయిలర్లు పట్టుకొని ఊయల ఊగింది. యోగసనాలు చేసింది. అంతేనా కూర్చొనే సీట్లపై ఎక్కి చిందులు వేస్తూ ఇష్టమెుచ్చినట్లు వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by KOKO … Read more

    వినరో భాగ్యము విష్ణు కథ టీజర్‌

    యువ కథనాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ నుంచి టీజర్‌ విడుదలయ్యింది. లవ్‌, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయంటూ చెప్పి, అసలు కాన్సెప్ట్‌ చెప్పకుండా టీజర్‌ను సిద్ధం చేశారు. టీజర్ కట్ చాలా కొత్తగా ఉంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్‌ మరింత మెరుగుపడింది. సినిమాలో కశ్మీరా హీరోయిన్‌గా నటించింది. మురళీ శర్మ, అమల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు.

    సైకిల్‌ ఇలా కూడా తొక్కుతారా?

    ఓ వ్యక్తి సైకిల్‌ తొక్కుతున్న[[ వీడియో](url)](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సైకిల్‌ తొక్కడంలో వింత ఏముంది అనుకుంటున్నారా ?. కానీ, ఇతడి స్టైల్‌ వేరు. నెత్తిపై చెక్కలు, రాడ్లు పెట్టుకొని, రెండు చేతులతో పట్టుకున్నాడు. సైకిల్‌ను పట్టుకోకుండానే బ్యాలెన్స్‌ చేస్తూ రద్దీగా ఉన్న ప్రాంతంలోనూ వేగంగా వెళ్లాడు.ఐపీఎస్‌ అధికారి అరిఫ్‌ షేక్‌ పెట్టిన పోస్ట్‌ పెట్టారు. దీనికి జీవితంలో ఏం లేకపోయినా.. ఇలాంటి ఆత్మస్థైర్యం ఉండాలనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల మందికి పైగా చూశారు. और कुछ मिले ना … Read more