• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 21 ఏళ్లలో 14 మంది పిల్లలు

    [VIDEO:](url) సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా ఓ మహిళ తన కుటుంబాన్ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందుకోసం కొత్తగా ఆలోచించింది. తన సంతానమైన 14 మందిని సరికొత్తగా పరిచయం చేస్తూ వాళ్లు ఏ సంవత్సరాల్లో జన్మించారో చెప్పుకొచ్చింది. 21 ఏళ్లలో 14 మందికి జన్మనిచ్చినట్లు చెప్పారు. తాను 42 ఏళ్ల వయసులో 2017లో చిన్న కూతురికి జన్మనిచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది. https://twitter.com/i/status/1615767605989482497 Screengrab Twitter:yashar Screengrab Twitter:yashar

    బోనులో ఉంది కదా అని చెయ్యి పెడితే వేలు పోయే!

    క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలి. జూలో ఉన్న జంతువులను దూరం నుంచి చూసి అలా ఫొటో దిగితే తప్పు లేదు. కానీ, ఏమవుతుందిలే అని అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు. ఓ వ్యక్తి సింహం బోనులో చేతి పెట్టి జూలను ముట్టుకోవటానికి ప్రయత్నించాడు. ఇంతలో అది వేలును నోటితో పట్టుకుంది. ఎంతగా ప్రయత్నించినా విడువలేదు. వేలును లాగేసింది. కొద్దిరోజులుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Earth Reels … Read more

    శుభమన్ గిల్ డబుల్ సెంచరీ సంబరాలు

    యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్‌ డబుల్ సెంచరీ చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. గిల్ 200 పరుగులు సాధించిన తర్వాత డగౌట్‌లో సహచర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అందులో జమ్మూ ఎక్స్‌ప్రెస్ చప్పట్లు కొడుతూ డాన్స్ చేస్తూ కనిపించాడు. 208 పరుగుల వద్ద ఔట్ అయిన తర్వాత గిల్‌ను డ్రెస్సింగ్‌ రూమ్ వద్ద అభినందించారు. కోహ్లి, హార్దిక్ పాండ్యా, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మెచ్చుకున్నారు. 2⃣0⃣0⃣ !? ? ???????? ????!?? One mighty knock! ? ? The moment, the reactions … Read more

    నేటి నుంచి ప్రతి గ్రామంలో కంటి వెలుగు శిబిరం

    తెలంగాణలో కంటి వెలుగు రెండో విడత లాంఛనంగా ప్రారంభయ్యింది. ఇవాళ్టి నుంచి పంచాయితీలు, రైతు వేదికల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు శిబిరం ఉంటుంది.

    బాత్‌ డ్రెస్‌లో శ్వేతా తివారి డాన్స్‌

    పఠాన్ సినిమాలోని బేషరమ్‌ రంగ్‌ పాటకు బుల్లితెర నటి శ్వేత తివారీ చేసిన రీల్‌ వైరల్ వుతోంది. స్నానం చేసే దుస్తుల్లో ఆమె చేసిన డాన్స్‌ మూవ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మీరు ఎన్ని నిమిషాల్లో రెఢీ అవుతారు అని వెయ్యిసార్లు ప్రశ్నించినా ..తన సమాధానం ఇదేనంటూ పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకర్షించటానికి ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు. View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) Screengrab Instagram:shwetha tiwari Screengrab Instagram:shwetha tiwari

    అదిరిపోయిన సుధీర్‌ బాబు హంట్ ట్రైలర్

    యంగ్ హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న హంట్ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. భరత్ నివాస్, శ్రీకాంత్ మేక కీలక పాత్రలు పోషించారు. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఏ కేసునైతే ఆ అర్జున్ మెుదలుపెట్టి పరిష్కరించలేకపోయాడో.. అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ పరిష్కరించాలంటూ శ్రీకాంత్ వాయిస్ ఓవర్ ఇవ్వటం ఆసక్తిని పెంచుతోంది. సినిమాను భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

    అసలైన క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్‌

    ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనందుకు తన తండ్రి ఎంతగానో సంతోషించినట్లు ఇషాన్ కిషన్ తెలిపాడు.“ అసలైన ఆట అంటే టెస్ట్ క్రికెట్. అందులోనే సవాళ్లు ఉంటాయి. బ్యాట్స్‌మెన్‌ నైపుణ్యాలు బయటపడతాయి. నేను ఎంపిక కావటం సంతోషంగా ఉంది “ అన్నాడు. శుభమన్ గిల్‌ ఇషాన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. టీ 20, వన్డే మాదిరిగా బౌండరీతో టెస్ట్ ప్రారంభిస్తావా అని అడగ్గా.. అక్కడ పరిస్థితిని బట్టి ఆడతానని చెప్పాడు. సిక్సులు కొట్టడం కంటే జట్టును మెరుగైన స్థితిలో ఉంచడమే ప్రాధాన్యత అన్నాడు. Of maiden Test … Read more

    నిర్మాత దిల్‌ రాజు లవ్‌ స్టోరీ

    కుటుంబ, ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించిన నిర్మాత దిల్‌ రాజుకి ఓ లవ్‌ స్టోరీ ఉంది. సంక్రాంతి సందర్భంగా భార్య తేజస్వినితో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాలను పంచుకున్నారు. “ నేను విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసేవాడిని. తను ఎయిర్‌హోస్టెస్. నేనే మెుదట ఇష్టపడ్డాను. పెళ్లి ప్రపోజల్ పెట్టే ముందు సంవత్సరం గమనించాను” అని చెప్పారు. తేజస్విని స్పందిస్తూ “ మెుదట ఆయన నన్ను పెన్ అడిగారు. తర్వాత అప్పుడప్పుడూ మాట్లాడేవారు. ఒకసారి ఫోన్ నంబర్ తీసుకున్నారు” అని చెప్పారు.

    పులి తుమ్మటం చూశారా?

    సాధారణంగా దుమ్ము, ధూళి వచ్చినప్పుడు మనుషులు తుమ్మటం కామన్. అడవిలో ఉండే జంతువులకు అలాంటి వాతావరణం ఉండదు కనుక ఎక్కువగా తుమ్మవు. కానీ, ఓ పులి రెండు సార్లు తుమ్మిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంత క్యూట్‌గా తుమ్మిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. pic.twitter.com/SXIEm6g31V — Tweets of Cats (@TweetsOfCats) January 15, 2023

    బాస్‌ పాటకు హీరోయిన్ లయ స్టెప్పులు

    స్వయంవరం హీరోయిన్‌ లయ.. వాల్తేరు వీరయ్య చిత్రంలోని పూనకాలు లోడింగ్‌ పాటకు స్టెప్పులేసింది. తన స్నేహితురాలితో కలిసి డోంట్‌ స్టాపింగ్‌ డాన్సింగ్‌ అంటూ చేసిన నృత్యం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన పలువురు లయ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. వివాహం చేసుకున్న తర్వాత లయ సినిమాలకు దూరంగా ఉంది. ఆమె చివరిగా రవితేజ నటించిన అమర్ అక్బర్‌ అంటోని. సినిమా నిరాశపర్చటంతో మళ్లీ కనిపించలేదు. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) Screengrab … Read more