క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలి. జూలో ఉన్న జంతువులను దూరం నుంచి చూసి అలా ఫొటో దిగితే తప్పు లేదు. కానీ, ఏమవుతుందిలే అని అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు. ఓ వ్యక్తి సింహం బోనులో చేతి పెట్టి జూలను ముట్టుకోవటానికి ప్రయత్నించాడు. ఇంతలో అది వేలును నోటితో పట్టుకుంది. ఎంతగా ప్రయత్నించినా విడువలేదు. వేలును లాగేసింది. కొద్దిరోజులుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.